Ameesha Patel: బద్రి భామ ఏంటీ.. ఇలా మారిపోయింది
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:09 PM
ఏ.. చికితా.. గుమస్తాస్ అంటూ బద్రి (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి ఆడిపాడిన భామ అమీషా పటేల్ (Ameesha Patel).
Ameesha Patel: ఏ.. చికితా.. గుమస్తాస్ అంటూ బద్రి (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి ఆడిపాడిన భామ అమీషా పటేల్ (Ameesha Patel). తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ముద్దుగుమ్మ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర కూడా వేసుకుంది. బద్రి హిట్ తరువాత తెలుగులో నాని, నరసింహుడు, పరమవీరచక్ర లాంటి సినిమాలతో మెప్పించింది. అయితే బద్రి ఇచ్చినంత విజయం మాత్రం మిగతా సినిమాలు ఇవ్వలేదు. దీంతో ఈ భామ టాలీవుడ్ ను పక్కనపెట్టి బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.
సినిమాల కంటే అమీషా వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. లీగల్ సమస్యలు, కేసులు, కోర్టులు అంటూ తిరుగుతూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత రెండేళ్ల క్రితం గదర్ 2 సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ ససినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో.. అమీషా వరుస సినిమాలను లైన్లో పెట్టింది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అమీషా నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
50 ఏళ్ళ వయస్సు వచ్చినా అమీషా ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిత్యం సోషల్ మీడియాలో కుర్ర హీరోయిన్లకు ధీటుగా అందాలను ఆరబోస్తూ కనిపిస్తూంది. తాజాగా ఈ భామ క్లివేజ్ షో చేస్తూ కిర్రెక్కించింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డిజైనర్ డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అమీషా ఏంటి.. ఇలా మారిపోయింది. ముఖంలో మునుపటి కళనే లేదు. వయస్సు మీదపడినట్లు కనిపిస్తుంది. ముఖం మొత్తం ముడుతలతో దారుణంగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
K Ramp: కలలే కలలే సాంగ్.. భలే కలర్ ఫుల్ గా ఉందే
Mohanlal: హంతకుడి బయోపిక్‌లో మోహన్ లాల్