Samantha: గ్రాజియా మ్యాగజైన్ పై సమంత హాట్ ఫోజులు.. అదిరిపోయిందంతే
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:02 PM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ మ్యాగజైన్ గ్రాజియా (Grazia).. సమంత 15 ఏళ్ళ కష్టం గురించి ప్రశంసించింది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ మ్యాగజైన్ గ్రాజియా (Grazia).. సమంత 15 ఏళ్ళ కష్టం గురించి ప్రశంసించింది. నేడు నేషనల్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పై సమంత హొయలు పోతో కనిపించింది. ఈ ఫోటోగ్రాఫ్స్ కోసం ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లు కష్టపడినట్లు గ్రాజియా తెల్పింది. వారందరితో సామ్ ఫొటోగ్రఫీ డే ను సెలబ్రేట్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ' 15 ఏళ్ల నట ప్రయాణంలో సమంత ఎన్నో మంచి పాత్రలు పోషించిందని గ్రాజియా పేర్కొంది. ఇక ఈ ఫోటోలలో సామ్ మరింత అందంగా కనిపించింది. 22 క్యారెట్ల బంగారు ఉంగరం, గాజులు, హారంతో సామ్ హాట్ ఫోజులలతోఅదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. కొన్నేళ్లుగా సామ్ మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో సిటాడెల్ అంటూ ఒక సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
హీరోయిన్ గా కాకుండా సామ్ నిర్మాతగా మారింది. శుభం సినిమాతో నిర్మాత మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సామ్ చేతిలో రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తోంది. ఇంకోపక్క మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నాయి. ఇంకోపక్క సామ్.. రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఈ డేటింగ్ రూమర్స్ పై సామ్ స్పందించలేదు. మరి ఎప్పుడు సామ్ తన రెండో పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.
HariHara Veeramallu: షాక్.. ఓటీటీకి వచ్చేసిన వీరమల్లు
Mirai: మిరాయ్ వాయిదా.. ఎందుకు?