Mirai: మిరాయ్ వాయిదా.. ఎందుకు?
ABN , Publish Date - Aug 19 , 2025 | 07:28 PM
ఈ మధ్య టాలీవుడ్ లో ప్రతి సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ రిలీజ్ అవుతున్నాయి. అసలు అనుకున్న టైమ్ కు వచ్చే సినిమాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు.
Mirai: ఈ మధ్య టాలీవుడ్ లో ప్రతి సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ రిలీజ్ అవుతున్నాయి. అసలు అనుకున్న టైమ్ కు వచ్చే సినిమాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. కొన్నేమో రిలీజ్ డేట్ లు లేక.. ఇంకొన్ని వేరే సినిమాలతో పోటీ పడలేక.. మరికొన్ని విఎఫ్ఎక్స్ లు అవ్వక.. ఇలా రకరకాల రీజన్స్ తో సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఒక్కసారి తమ సినిమా వాయిదా పడితే శుభ సూచకం కాదని భావించేవారు. కానీ, ఇప్పుడు ఇదొక ట్రెండింగ్ గా మారిపోయింది.
తాజాగా తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. హనుమాన్ లాంటి భారీ విజయం తరువాత తేజ నటిస్తున్న చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా సరసన రితికా నాయక్ నటిస్తుండగా.. మంచు మనోజ్ విల న గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశాడు తేజ.
ఇప్పటికే మిరాయ్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా క్రియేట్ చేసింది. ఇక ఇంకో నెలలో రిలీజ్ పెట్టుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంతో అభిమానుల్లో కొద్దిగా అనుమానం మొదలయ్యింది. అయితే అందుతున్న సమాచారం ఈసారి కూడా మిరాయ్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాయిదాకు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే సెప్టెంబర్ 5 న వస్తుంది.. లేకపోతే మాత్రం సెప్టెంబర్ 12 న రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
సెప్టెంబర్ 12 అంటే ఇప్పటికే దుల్కర్ సల్మాన్ కాంత, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలతో పోటీగా మిరాయ్ దిగుతుంది. మూడు.. మూడు డిఫరెంట్ కాన్సెప్ట్స్. కానీ, మిరాయ్ పెద్ద సినిమాగా రిలీజ్ కానుంది. ఆ రోజు సినిమా వస్తే బెల్లంకొండ వెనక్కి తగ్గుతాడేమో అనిపిస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.
Pawan Kalyan: అచ్చివచ్చిన సెప్టెంబర్ లాస్ట్ వీక్
Little Hearts Teaser: మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని ఎందుకు కంటారో తెలుసా