HariHara Veeramallu: షాక్.. ఓటీటీకి వచ్చేసిన వీరమల్లు

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:50 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫ్యాన్స్ కు అమెజాన్ పెద్ద షాక్ ఇచ్చింది. సడెన్ గా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఓటీటీ డేట్ ను ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చింది.

Harihara Veeramallu

HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫ్యాన్స్ కు అమెజాన్ (Amazon) పెద్ద షాక్ ఇచ్చింది. సడెన్ గా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఓటీటీ డేట్ ను ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్ విలన్ గా నటించాడు. ఐదేళ్లుగా రిలీజ్ కు నోచుకోని ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూలై 24 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.


అసలు ఇన్నేళ్ల తరువాత వీరమల్లు రిలీజ్ అయితే భారీ డిజాస్టర్ అవుతుందని, ఎక్కువ ట్రోల్ చేస్తారని అనుకున్నారు. కానీ, వీరమల్లు కొంతవరకు పాజిటివ్ టాక్ నే అందుకుంది. సినిమాలో కొన్ని చోట్ల ట్రోల్ కు గురి కాబడింది కానీ, టోటల్ గా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కలక్షన్స్ ను ఫ్యాన్స్ పట్టించుకోరు అన్న విషయం తెల్సిందే. ఇక ఇదంతా పక్కన పెడితే నెల తిరక్కుండానే వీరమల్లు ఓటీటీలోకి అడుగుపెట్టబోతుంది.


హరిహర వీరమల్లు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఆగస్టు 20 నుంచి వీరమల్లు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఒకపక్క షాక్ అవుతూనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పై ట్రోల్ జరిగిన విషయం తెల్సిందే. ఆ తరువాత పొరపాటును సరిదిద్దుకున్న మేకర్స్.. సినిమాలో అనవవసరమైన సీన్స్ ను తొలగించి కొన్ని కొత్త సీన్స్ ను యాడ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలో అదే స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ లో పాజిటివ్ టాక్ అందుకున్న ఈసినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Mirai: మిరాయ్ వాయిదా.. ఎందుకు

Little Hearts Teaser: మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని ఎందుకు కంటారో తెలుసా

Updated Date - Aug 19 , 2025 | 08:21 PM