Samantha: బాయ్ ఫ్రెండ్ తో సమంత దీపావళీ సంబరాలు.. పెళ్లి కన్ఫర్మ్
ABN, Publish Date - Oct 21 , 2025 | 10:51 AM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పండగపూట తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో కలిసి తన కొత్తింట్లో దీపావళీ సంబరాలను జరుపుకుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పండగపూట తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో కలిసి తన కొత్తింట్లో దీపావళీ సంబరాలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. రాజ్ కుటుంబంతో కలిసి ఆమె కనిపించింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని రాసుకొచ్చింది.
ఇక సమంత త్వరలోనే రెండో పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సామ్.. ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఒక ఏడాది మొత్తం మయోసైటిస్ కి చికిత్స తీసుకొని ఆరోగ్యంగా మారింది. ఆ సమయంలోనే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ మొదలుపెట్టింది.
అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సామ్ - రాజ్ ఒకే ఇంటిలో కలిసి ఉంటున్నారని తెలుస్తోంది. ముంబైలో తనకంటూ ఒక సొంత ఇంటిని నిర్మించిన సామ్.. అందులోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతుంది అని ఈ పండగ వెలుగుల్లో వెలిగిపోతున్న సామ్ ముఖం చూస్తుంటేనే అర్ధమవుతుంది. త్వరలోనే రాజ్ తో సామ్ పెళ్లి పీటల మీద కూర్చుంటుంది అని టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా సామ్ హ్యాపీగా ఉంటే చాలు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి త్వరలోనే సామ్ పెళ్లి విషయం చెప్తుందా.. లేక ఇలానే ఒకే ఇంట్లో కలిసి ఉంటారా.. ? అనేది చూడాలి.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్.. రచ్చరంబోలా! ఒకరిని మించి మరొకరు
Bollywood: హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి