సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

War 2: దునియా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Aug 20 , 2025 | 05:12 PM

వార్ 2(War 2) విషయంలో అనుకున్నది ఒక్కటి అయితే.. అయ్యింది ఒక్కటి. ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఎంట్రీ సినిమా అనేసరికి ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

War 2

War 2: వార్ 2(War 2) విషయంలో అనుకున్నది ఒక్కటి అయితే.. అయ్యింది ఒక్కటి. ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఎంట్రీ సినిమా అనేసరికి ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అందులోనూ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో మల్టీస్టారర్ అనేసరికి ఇండస్ట్రీలో ఇదొక చరిత్రగా మిగిలిపోతుంది అనుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. కథ మొత్తం రొటీన్ గా ఉండడంతో పాటు.. ఎన్టీఆర్ లుక్ బాలేదని, విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదని పెదవి విరిచారు.


ఇక కలక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో వార్ 2 నుంచి ఒక్కో వీడియో సాంగ్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచాలని చూస్తున్నారు. అందులో భాగంగానే వార్ 2 నుంచి దునియా సలాం అనాలి అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వార్ 2 కు స్పెషల్ హైలైట్ అంటే ఈ సాంగ్ అనే చెప్పాలి. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించే సాంగ్ ఇది. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి స్టెప్పులు వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.


ఎన్టీఆర్ గ్రేస్.. హృతిక్ స్టైల్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ ను నకాష్ అజీజ్, యాజిన్ నిజార్ తమ అద్భుతమైన గాత్రంతో ఆలపించారు. బాలీవుడ్ లో పార్టీ సాంగ్స్ ఎలా ఉంటాయో.. అందరికీ తెల్సిందే. ఈ సాంగ్ కూడా అందుకు తీసిపోలేదు. ఎంతో రిచ్ నెస్ ఈ సాంగ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వకుండా ఉండలేరు. బాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ అంటే హృతిక్ అని చెప్పుకొస్తారు. అలాంటి హృతిక్ నే ఎన్టీఆర్ డామినేట్ చేసినట్లు కనిపిస్తుంది.


హృతిక్ రోషన్ సైతం ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్ సింగిల్ షాట్ లోనే స్టెప్స్ ఓకే చేసేవాడని, అసలు ఇలాంటి ఒక హీరోను తాను ఇంతవరకు చూడలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. వీరి డ్యాన్స్ కు ఎవ్వరైనా సలాం అనాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ బాట పడుతుందని రూమర్స్ వినిపిస్తున్నయికి. మరి నెల తిరక్కుండానే వార్ 2 ఓటీటీలోకి వస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Rajendra Prasad: 'నేనెవరు' టైటిల్ లోగో ఆవిష్కరణ

Naga Vamsi: నన్ను మిస్ అవుతున్నారా.. దానికి చాలా టైమ్ ఉంది

Updated Date - Aug 20 , 2025 | 05:52 PM