Rajendra Prasad: 'నేనెవరు' టైటిల్ లోగో ఆవిష్కరణ

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:12 PM

'అమీతుమీ' చిత్రంలో కీలక పాత్ర పోషించిన జోగిని శ్యామల, ఇప్పుడు 'నేనెవరు?' సినిమాలోనూ ప్రధాన పాత్రపోషించింది. ఈ సినిమా టైటిల్ లోగోను సినీ ప్రముఖులు ఆవిష్కరించారు.

Nenevaru Telugu Movie

కొంతకాలంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad ), 'నువ్వేకావాలి, ప్రేమించు' వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్ (Saikiran), జోగిని శ్యామల కీలక పాత్రలు పోషించిన 'నేనెవరు?' చిత్రంలో నటించారు. చిరంజీవి తన్నీరు (Chiranjeevi Tanneeru) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సందేశాత్మక చిత్రాన్ని సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ (Vizag Satyanand) శిష్యులు అభిలాష్, సాయి చెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి.... ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.


త్వరలో విడుదల తేదీ ప్రకటించుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత కె. ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వి. సముద్ర ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ ధియేటర్ లో జరిగిన ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని, ఈ సినిమా తామందరికీ పేరు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాలోని పాటను ఎస్.ఎస్. వీరు పాడగా, చిన్నికృష్ణ స్వరాలు సమకూర్చారు.

Also Read: Naga Vamsi: నన్ను మిస్ అవుతున్నారా.. దానికి చాలా టైమ్ ఉంది

Also Read: Nara Rohith: ట్రైలర్ నచ్చకపోతే సినిమా చూడరు.. వార్ 2 ఇప్పటివరకు చూడలేదు

Updated Date - Aug 20 , 2025 | 05:16 PM

Rajendra Prasad: అందుకే ఎన్టీఆర్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది

Rajendra Prasad: అందుకే పవన్‌ కల్యాణ్‌.. సీరియస్‌గా తీసుకున్నాడు

Rajendra Prasad: అది మీ ఖ‌ర్మ‌.. నేను ఇలాగే ఉంటా! అస‌భ్య‌క‌ర కామెంట్స్‌పై రాజేంద్ర ప్ర‌సాద్‌

Rajendra Prasad: ఇది సంస్కారవంతమైన కేటగిరీకి చెందిన సినిమా

Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే