Sai Durgha Tej: మామకు దారిచ్చిన మేనల్లుడు

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:52 PM

మెగా మేనల్లుడు వరుస మార్చేశాడు. మామకోసం వెనక్కి తగ్గాడు. అందుకోసం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. మామ కోసం అల్లుడు చేసిన త్యాగమేంటో తెలియాలంటే ఇది చదివేయండి...

మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ (Sai Durga Tej ) మెగాభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఆక్సిడెంట్ తర్వాత కెరీర్ కు చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'విరూపాక్ష' (Virupaksha)తో వందకోట్ల క్లబ్ లో చేరిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు అదే టెంపోను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడు. 'విరూపాక్ష, బ్రో'( Bro) ఇచ్చిన బూస్ట్ తో 'సంబరాల ఏటి గట్టు' (Sambarala Yeti Gattu) మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తేజ్ మేకోవర్ కు ఫ్యాన్స్ ఫిదా అవ్వడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా కోసం అంతలా కష్టపడ్డ ఈ హీరో ఇప్పుడు మామ కోసం వెనక్కి తగ్గుతున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), తేజ్ మధ్య ఉన్న అనుబంధం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మేనమామల స్పూర్తి తో సినిమాల్లోకి వచ్చిన ఈ యంగ్ హీరో... వారి కోసం ఎలాంటి త్యాగానికైనా రెడీగా ఉంటాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన రిలీజ్ డేట్ ను మార్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'సంబరాల ఏటి గట్టు'ను మొదట సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు. అదే రోజున పవర్ స్టార్ నటిస్తున్న 'ఓజీ' (OG) విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే 'ఓజీ' వాయిదా పడుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నా, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. దీంతో సెప్టెంబర్ 25న 'ఓజీ' రిలీజ్ పక్కా కావడంతో మేనమామ సినిమాకు చోటిచ్చి, సాయి దుర్గా తేజ్ తన 'సంబరాల ఏటి గట్టు'ను డిసెంబర్ కు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మామకు దారి ఇస్తున్న హీరో అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్.

'సంబరాల ఏటి గట్టు' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందట. మరో 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. దీంతో మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికే మేకర్స్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అయితే డిసెంబర్ లోనూ రెండు తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) కాగా, అడివి శేష్ నటిస్తున్న 'డెకాయిట్' రెండోది. ఇందులో 'ది రాజా సాబ్' జనవరికి పోస్ట్ పోన్ కావచ్చునని తెలుస్తోంది. అదే జరిగితే... డిసెంబర్ 5న 'సంబరాల యేటి గట్టు' రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ సినిమాను రోహిత్ కె.పి. (Rohith KP) దర్శకత్వంలో 'హనుమాన్' ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి దుర్గా తేజ్ కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) నటిస్తుండగా... కీ-రోల్స్ లో జగపతి బాబు (Jagapathi Babu), శ్రీకాంత్ (Srikanth ) నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా గురించిన అధికారిక సమాచారం ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Read Also: Prithviraj Sukumaran: ఎస్‌ఎస్‌ఎంబీ29పై కీలక వ్యాఖ్యలు

Read Also: Rashmi Gautam: ఏదీ శాశ్వతం కాదు.. మళ్లీ కలుద్దాం.. రష్మీకి ఏమైంది..

Updated Date - Jul 24 , 2025 | 05:16 PM