Rashmi Gautam: ఏదీ శాశ్వతం కాదు.. మళ్లీ కలుద్దాం.. రష్మీకి ఏమైంది..
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:11 AM
తాజాగా రష్మీ పంచుకున్న ఓ పోస్ట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. మళ్లీ కలుద్దాం అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అయితే ఆమె ఇలా ఎందుకు పోస్ట్ పెట్టిందని అంతా ఆశ్చర్యపోయారు.
రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ట్రెండీ యాంకర్‌గా (Anchor Rashmi Gautam), అప్పుడప్పుడు సినిమాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తను చెప్పాలనుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సూటిగా చెబుతుంటారు. నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్లపై ఆమె మాటలు కాస్త ఘాటుగానే ఉంటాయి. అలాగే హాట్‌హాట్ లుక్స్‌తో ఎంటర్‌టైన్ చేయడంలోనే ముందుంటారు. తాజాగా ఆమె పంచుకున్న ఓ పోస్ట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘ఏదీ శాశ్వతం కాదు. ఈ కాలం కూడా గడిచిపోతుంది. మళ్లీ కలుద్దాం’ అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అయితే ఆమె ఇలా ఎందుకు పోస్ట్ పెట్టిందని అంతా ఆశ్చర్యపోయారు. ఆ పోస్ట్‌లోనే అసలు విషయం ఏంటో కూడా చెప్పారు. ఇక సోషల్ మీడియాకు గుడ్ బై అనేది రష్మీ పోస్ట్ సారాంశం. (Rashmi Gautam Digital detox)
‘‘హలో ఆల్.. ఒక నెల రోజులపాటు డిజిటల్ డీటాక్స్ పాటించాలనుకుంటున్నా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియా కూడా అందులో ఓ భాగమే. కొన్నిసార్లు అది మన ఆలోచనలను చాలా ప్రభావితం చేస్తుంది. ఒక విషయంలో మాత్రం మాట ఇస్తున్నా. కచ్చితంగా నేను డబుల్ ఎనర్జీతో తిరిగి వస్తా. నా శక్తియుక్తులను రీ బిల్ట్ చేసుకోవాలి. ఎలాంటి ప్రేరణ, డిజిటల్ ఎఫెక్ట్ లేకుండా నాకు నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనెప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నేనూ కుంగిపోతున్నాను. కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇది నాకు సరైన సమయం. అభిమానులకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీ ప్రేమ మద్దతు కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. ఉన్నటుండి రష్మీ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ తనకు ఏమైందంటూ ఆరాలు తీస్తున్నారు. రష్మీ మాటలను బట్టి చూస్తే.. కొంతకాలం ఆమె ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటుందనిపిస్తుంది.