సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai Durga Tej: నన్ను.. నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు

ABN, Publish Date - Sep 13 , 2025 | 07:20 PM

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sai Durga Tej

Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. చిన్న మామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లానే సామాజిక సేవ చేస్తూ కనిపిస్తాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్ ను తేజ్ ఎప్పుడు సమర్దించడు. తాజాగా తేజ్.. అభయం సమ్మిట్ 2025 లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ లో సోషల్ మీడిమా.. చిన్నపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేదానిపై చర్చించారు.


సోషల్ మీడియాలో చిన్న పిల్లలు వినేవి, చూసేవి చాలావరకు అసభ్యకరంగానే ఉంటున్నాయని, ట్రోల్స్ ను పెద్దవారు తీసుకున్నంత ఈజీగా పిల్లలు తీసుకోలేకపోతున్నారని.. పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు.. ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు తెలిసేలా చేయాలనీ.. దానికోసం ప్రతి సోషల్ మీడియా అకౌంట్ కు తల్లిదండ్రుల ఆధార్ కానీ, పెద్దల ఆధార్ ను యాడ్ చేస్తే వారికి భయం వస్తుంది అని తేజ్ చెప్పుకొచ్చాడు. అక్కడ సమ్మిట్ పాల్గొన్నవారి ప్రశ్నలకు తేజ్ ఎంతో ఒప్పిగ్గా సమాధానాలు చెప్పాడు.


ఇక సమ్మిట్ లో ఒక వ్యక్తి ' ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లల మీద కానీ, సెలబ్రిటీల మీద కానీకే కామన్ గా పర్సనల్ ఎటాక్ జరుగుతుంది. అన్ని అడ్రెస్స్ చేయలేకపోవచ్చు. కానీ, మీరు కొన్నిటి మీద చర్యలు తీసుకోవచ్చు. మీరు ప్రభుత్వంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకు ఏమైనా సలహాలు ఇచ్చి ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకొనే ఛాన్స్ ఉంటుందా.. ? ' అని ఒక ప్రశ్న అడగ్గా.. దానికి తేజ్ మాట్లాడుతూ.. ' నేను సోషల్ మీడియాలో ఇలాంటివి ఫేస్ చేస్తున్నాను. ఏది మాట్లాడినా కింద కామెంట్స్ లో తిడుతున్నారు. నన్నే కాదు.. నా ఫ్యామిలీని మొత్తం బూతులు తిడుతున్నారు. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వారిని ఏమి అనలేం. వారు ప్రేమతో చేస్తున్నారో.. ఇంకొకరి మీద కోపంతో చేస్తున్నారో అర్ధం కాదు. ఎవరో ఒకరు దాన్ని రేపుతారు. దాంతో వాళ్ళు రెచ్చిపోయి మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు.


మేము పెద్దవాళ్లం కాబట్టి మేము తీసుకోగలుగుతాం. చిన్నపిల్లలకేం తెలుస్తుంది. వారికంటూ ఒక బాధ్యత వారి మైండ్ లో రావాలి. అందుకే చెప్పాను వారి సోషల్ మీడియా ఐడీస్ కి ఆధార్ కార్డును లింక్ చేయాలి. అలా చేస్తే వారికంటూ ఒక బాధ్యత వస్తుంది. ఏదైనా మాట్లాడాలి అంటే భయమేస్తుంది. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కామెంట్స్ లో బండబూతులు ఉంటాయి. నేను తీసుకోగలను పెద్దవాడిని కాబట్టి. కానీ, 15 , 16 ఏళ్ళ పిల్లలు ఎలా తీసుకుంటారు. వారికి భయం రావాలంటే ఆధార్ కార్డును లింక్ చేస్తే తెప్పించగలం' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు.

Sai Pallavi: శింబుతో సాయి పల్లవి రొమాన్స్..

TG Viswa Prasad: అరుణాచలంలో రజినీకాంత్ ని కాదు..

Updated Date - Sep 13 , 2025 | 07:21 PM