Sai Pallavi: శింబుతో సాయి పల్లవి రొమాన్స్..

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:16 PM

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బుల కోసం సినిమాలు చేసే హీరోయిన్ కాదు సాయిపల్లవి.

Sai Pallavi

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బుల కోసం సినిమాలు చేసే హీరోయిన్ కాదు సాయిపల్లవి. తాను ఒక సినిమా చేస్తే.. అది అందరికీ నచ్చాలి. ముఖ్యంగా తన పాత్ర తనకు నచ్చాలి. అందులో ప్రాధాన్యత ఉండాలి. సినిమా మొత్తం తనే ఉండాలి. ఇలా అన్ని సరిచూసుకున్నాకే ఆమె సినిమా ఒప్పుకుంటుంది. గ్లామర్ ఒలకబోయడం, కథకు ప్రాధాన్యత లేకుండా అప్పుడప్పుడు కనిపించి వెళ్లిపోయేలాంటి పాత్రలు అస్సలు ఒప్పుకోదు.


ఇప్పటివరకు సాయిపల్లవి చేసిన సినిమాలన్నీ అలాంటివే.ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ లో బిజీగా మారింది. రామాయణలో సీతగా నటిస్తోంది. ఇది కాకుండా ఏక్ దిన్ అనే సినిమాలో నటిస్తుంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. ఈ సినిమానే సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ అవుతుంది.


ఇక ఇదంతా పక్కనపెడితే.. కోలీవుడ్ లో సాయిపల్లవి ఒక సినిమా కోసం రిస్క్ చేస్తుందా అంటే నిజమే అనే మాటలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. సూర్యతో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన అది ఆగిపోయిన విషయం తెల్సిందే. ఇప్పుడు సూర్యతో చేయాల్సిన సినిమానే వెట్రిమారన్.. శింబుతో చేస్తున్నాడు. ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. ఈ వెట్రిమారన్ సినిమాలు అంటే రా అండ్ రస్టిక్ గా ఉండడంతో పాటు హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.


అందుతున్న సమాచారం ప్రకారం.. వెట్రిమారన్ తన సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ కావడంతో సాయిపల్లవి అయితే బెస్ట్ అని ఆయన భావిస్తున్నాడట. మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారట. రెట్రోలో ఆమె పాత్ర నచ్చడంతో.. పూజా కూడా బావుంటుంది అనుకున్నా.. ఎక్కువ సాయిపల్లవి వైపే మొగ్గు చూపడంతో ఆమెనే ఫైనల్ చేయడానికి సిద్ధమయ్యారని టాక్. అయితే సాయిపల్లవి ఈ సినిమాకు ఒప్పుకుంటుందా అనేది అనుమానమే. శింబు ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా మే ఒప్పుకుంటే అది ఆమె కెరీర్ కే పెద్ద రిస్క్ అని, అలాంటి రిస్క్ అవసరం లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

TG Viswa Prasad: అరుణాచలంలో రజినీకాంత్ ని కాదు..

Manchu Manoj: ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది

Updated Date - Sep 13 , 2025 | 06:16 PM