The Paradise: హాలీవుడ్‌కు నాని 'ది ప్యారడైజ్'.. ప్రజంటర్‌గా 'డెడ్ ఫూల్' హీరో
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:32 PM
నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మూవీకి హాలీవుడ్ సెన్సేషన్ ర్యాన్ రోనాల్డ్స్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది మార్చిలో ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లోనూ విడుదల కానుంది.
'దసరా' (Dasara) సినిమా చక్కని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వస్తున్న రెండో సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise). ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా అందరి అటెన్షన్ ను తన వైపు తిప్పుకుంది. నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపించ బోతున్నాడు. ఇందులో అతని మేకోవర్ చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. డెప్త్ స్టోరీని తీసుకుని, అంతే హార్డ్ హిట్టింగ్ దాన్ని సిల్వర్ స్క్రీన్ మీద శ్రీకాంత్ ఓదెల ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' విషయంలో ఆకాశమే హద్దు అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను ఎస్.ఎస్.వి. సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) తో కలిసి నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.
అయితే ఇప్పుడు థింక్ బిగ్ అన్న తరహాలో ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఇంటర్నేషనల్ పర్సన్స్ ను ఇందులో ఇన్ వాల్వ్ చేసే పనిలో పడ్డాడు నాని. హాలీవుడ్ కు చెందిన ర్యాన్ రేనాల్డ్స్ (Ryan Reynold) ను ఈ ప్రాజెక్ట్ కు ఇంటర్నేషనల్ ప్రజెంటర్ గా సెట్ చేయబోతున్నారట. చాలా నెలలుగా ఆయనతో చర్చలు జరుగుతున్నాయని, అటు నుండి సానుకూలమైన స్పందన వచ్చిందని అంటున్నారు. అన్ని అనుకున్నటు జరిగితే అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. విలక్షణ నటుడు మోహన్ బాబు (Mohanbabu) కీలక పాత్ర పోషిస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ వచ్చే యేడాది మార్చి 27న ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లోనూ విడుదల కానుంది.
Also Read: Akhanda 2: తమన్.. అసలు ఏం ఫ్లాన్ చేస్తున్నావయ్యా! ఫ్యూజులు ఎగురుతున్నాయ్
Also Read: Bahubali: The Epic Review: బాహుబలి: ది ఎపిక్ ఎలా ఉందంటే