Akhanda 2: తమన్.. అసలు ఏం ఫ్లాన్ చేస్తున్నావయ్యా! ఫీజులు ఎగురుతున్నాయ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:23 AM
అఖండ2 మ్యూజిక్‌పై దృష్టి పెట్టిన తమన్ ఇప్పటికే ఉత్తరాది నుంచి మిశ్రా బ్రదర్స్ ను తీసుకు రాగా తాజాగా సర్వేపల్లి సిస్టర్స్ ను తెర మీదకు తీసుకు వచ్చాడు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) చిత్రంపై భారీ అంచనాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే థమన్ (Thaman S) ‘అఖండ’ సినిమా మ్యూజిక్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసి ఇప్పుడు ‘అఖండ 2’ కోసం మరింత పవర్‌ఫుల్, డివైన్ టోన్ సృష్టిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాటలు, సంగీతంపై దృష్టి పెట్టిన తమన్ శ్లోకాలు వళ్లించడంలో ఉద్దండులైన వారిని రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ఉత్తరాది నుంచి మిశ్రా బ్రదర్స్ ను తీసుకు రాగా తాజాగా సర్వేపల్లి సిస్టర్స్ (Survepalli Sisters) ను తెర మీదకు తీసుకు వచ్చాడు. ‘అఖండ 2: తాండవం’ కోసం థమన్ అందిస్తున్న శక్తిమంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మరింత అద్భుతంగా మార్చేందుకు సర్వేపల్లి సిస్టర్స్ గాత్రాన్ని పాటల కోసం వాడుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం ప్రత్యేకమైన శివతాండవ రాగాల కలయికతో థమన్ ఒక ఆధ్యాత్మిక మాస్ థీమ్ రూపొందిస్తున్నారు. ఫ్యాన్స్ ఇప్పటికే థమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన చిన్న సౌండ్ స్నిప్ వల్ల ఎగ్జైట్ అవుతున్నారు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ మరోసారి రికార్డులు తిరగరాయ బోతుందన్న నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చెన్నై పరిసరాల్లో జరుగుతుండగా, మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ సమాంతరంగా సాగుతోంది.