RT76: మాస్ మహారాజా కొత్త సినిమా.. ముహూర్తం ఎప్పుడంటే..?
ABN, Publish Date - Jun 04 , 2025 | 07:30 PM
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) ప్లాప్ తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) ప్లాప్ తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే మాస్ జాతర(Mass Jathara) రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక దీని తరువాత రవితేజ నటిస్తున్న మరో చిత్రం RT76.
ఎప్పటి నుంచో కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ RT76 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 5 ఉదయం 9. 02 నిమిషాలకు పూజా వేడుక మొదలుకానుందని మేకర్స్ తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్ లో రవితేజ.. ఎయిర్ పోర్ట్ లో సూట్ కేస్ పట్టుకొని ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించాడు. అయితే ఈ పోస్టర్ లో ఎక్కడా డైరెక్టర్ పేరును రివీల్ చేయలేదు. దీంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు అనార్కలి(Anarkali) అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం.
Also Read: Benz: లోకేష్ యూనివర్స్ లోకి కొత్త విలన్ గా మరో స్టార్ హీరో
అంతేకాకుండా ఈ చిత్రంలో రవితేజ సరసన సెన్సేషనల్ బ్యూటీస్ కయదు లోహర్(Kayadu Lohar), మమితా బైజు(Mamitha Baiju) నటిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, వారికి డేట్స్ దొరకకపోవడంతో.. మెయిన్ హీరోయిన్ గా ఆషికా రంగనాధన్ ను తీసుకున్నారని, ఇంకో హీరోయిన్ గా కేతిక శర్మను ఒకే చేసారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.