సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: 'జార్జిరెడ్డి' దర్శకుడితో సాగర్ పాన్ ఇండియా మూవీ

ABN, Publish Date - Oct 03 , 2025 | 03:21 PM

బుల్లితెర క్రేజీ స్టార్ ఆర్.కె. నాయుడు అలియాస్ సాగర్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. 'జార్జిరెడ్డి' ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

RK Naidu Aka Sagar New movie

ప్రముఖ దర్శక నిర్మాత, కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) సింగరేణి కార్మికుల వెతలపై చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు మరోసారి సింగరేణి కార్మికుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈసారి ఇది జాతీయ స్థాయిలో విడుదల కానుంది. బుల్లితెర కథానాయకుడు, 'ది 100' ఫేమ్ సాగర్ (Sagar) హీరోగా 'జార్జిరెడ్డి' దర్శకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఈ సినిమాను నిర్మించబోతున్నారు.


ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, 'సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి కార్మికుల దుర్భలమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై తెరకెక్కే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మలుస్తున్నాం' అని అన్నారు.

సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతదేశ సినీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. మైనింగ్ ప్రాంతాల కఠినమైన వాతావరణం, కార్మికుల దినచర్య, వారి త్యాగాలు వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ మూవీలో ముఖ్య పాత్రలో ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నారని సమాచారం. ఈ స్పెషల్ కారెక్టర్‌ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకోనున్నారు.


స్వతహాగా సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన నటుడు సాగర్... తాను చూసిన జీవితాల్ని, పాత్రల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారీ సెట్స్‌ (అండర్ గ్రౌండ్ బొగ్గు గని సెట్టింగ్స్‌)లో సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ జరగడం ఈ సినిమా నిర్మాణ విలువలను తెలియజేస్తుంది. నవంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా చిత్రబృందం ప్రకటించింది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేయనున్నారు.

Also Read: Tollywood: మరో సినీ రచయిత మృతి...

Also Read: Ram Charan: ఆర్చరీ ప్రీమియర్ లీగ్.. APL ప్రారంభించిన రామ్‌చ‌ర‌ణ్‌

Updated Date - Oct 03 , 2025 | 03:24 PM