RK Deeksha: సుమన్ ఆవిష్కరించిన 'ఆర్. కె. దీక్ష' ట్రైలర్

ABN , Publish Date - Dec 08 , 2025 | 06:18 PM

ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఆర్.కె. దీక్ష' మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సీనియర్ నటుడు సుమన్ విడుదల చేశారు.

RK Deeksha Movie

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (Prathani Ramakrishna Goud) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'ఆర్.కె. దీక్ష' (RK Deeksha). డి.ఎస్.రెడ్డి సమర్పణలో నిర్మితమైన ఈ సినిమాలో 'ఢీ' జోడీ ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా, కిరణ్ హీరోగా నటించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజ్ కిరణ్‌ సంగీతం అందించగా మేనగ శ్రీను ఎడిటర్ గా వ్యవహరించారు. అతి త్వరలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను సీనియర్ నటుడు సుమన్ ఆవిష్కరించారు.


'ఆర్.కె. దీక్ష' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, ట్రెజరర్ ప్రసన్న కుమార్, సి. కళ్యాణ్ తదితరులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు యేడాది పాటు సాగిందని, ఇందులో ఐదు పాటలతో పాటు మూడు ఫైట్స్ ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ఇందులోని ఓ పాటను అంకితం చేశాం. జవాన్ లను కీర్తించేలా ఈ పాట సాగుతుంది' అని అన్నారు. గతంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన వ్యక్తిగా ఇందులో జవాన్ సాంగ్ కు తాను బాగా కనెక్ట్ అయ్యానని చిత్ర సమర్పకుడు డి.ఎస్.రెడ్డి చెప్పారు. ఈ చిత్రం తమందరి జీవితాలకు మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉందని హీరో, హీరోయిన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ స్నిగ్థ రెడ్డి, వైస్ ఛైర్మన్ గురు రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Rashi Singh: లెక్చరర్ తో ప్రేమ.. అక్కడ టైమ్ పాస్ చేశాం

Also Read: Nandamuri Balakrishna: అదిరా బాలయ్య అంటే.. రూ. 17 కోట్లు వెనక్కి ఇచ్చేసి

Updated Date - Dec 08 , 2025 | 06:18 PM