Rashi Singh: లెక్చరర్ తో ప్రేమ.. అక్కడ టైమ్ పాస్ చేశాం
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:21 PM
ధారణంగా ఏ కాలేజ్ లో అయినా అమ్మాయిలకు.. సార్స్ మీద.. అబ్బాయిలకు, మేడమ్స్ మీద క్రష్ ఉంటుంది. అయితే అలాంటివి ఎప్పుడు స్టూడెంట్స్ బయటపెట్టరు.
Rashi Singh: సాధారణంగా ఏ కాలేజ్ లో అయినా అమ్మాయిలకు.. సార్స్ మీద.. అబ్బాయిలకు, మేడమ్స్ మీద క్రష్ ఉంటుంది. అయితే అలాంటివి ఎప్పుడు స్టూడెంట్స్ బయటపెట్టరు. కానీ, కొంతమంది అమ్మాయిలు మాత్రం.. లెక్చరర్స్ ను మార్క్స్ ఎక్కువ రావడం కోసం ఉపయోగించుకుంటారు. వారితో చనువుగా మాట్లాడుతూ వారికి ఏ పని కావాలంటే దాన్ని చేయించుకుంటారు. గతంలో హీరోయిన్ కయాదు లోహర్ ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చింది. కాలేజ్ లో లెక్చరర్స్ తనకు సపోర్ట్ గా ఉండేవారని, అందుకే తనకు ఎక్కువ మార్కులు వచ్చినట్లు చెప్పింది. ఇక వారి లిస్ట్ లోనే రాశీ సింగ్ (Rashi Singh) కూడా చేరింది.
శశి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ సింగ్. ఈ సినిమా తరువాత ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్ లాంటి సినిమాల్లో నటించింది. ఈ మధ్యనే ఆమె రాజ్ తరుణ్ నటించిన పాంచ్ మినార్ లో కూడా నటించింది. మంచి మంచి సినిమాల్లో నటించినా అవేమి అమ్మడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఇకపోతే ప్రస్తుతం రాశీ సింగ్ 3 రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక 3 రోజెస్ సీజన్ 2 ప్రమోషన్స్ లో రాశీ తన కాలేజ్ డేస్ లో జరిగిన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ' నేను కాలేజ్ లో చదివే రోజుల్లో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు మా లెక్చరర్. నాకు అన్ని ఫేవర్స్ చేసేవాడు. ఎగ్జామ్ పేపర్లు ముందే ఇచ్చేవాడు. ఇప్పుడు అతనికి పెళ్లయింది. నన్ను ఇంస్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఫాలో అవుతుంది. ఇక వైవా జరిగే సమయంలో తను ఏమి అడిగేవాడు కాదు. మేము ఎదురెదురుగా కూర్చొని టైమ్ పాస్ చేసేవాళ్లం. కానీ, మా మధ్య ఏమి జరగలేదు. అప్పుడు నా వయస్సు 17 ఏళ్లు.. అతనికి అప్పటికి పెళ్లి కాలేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.