Nandamuri Balakrishna: అదిరా బాలయ్య అంటే.. రూ. 17 కోట్లు వెనక్కి ఇచ్చేసి

ABN , Publish Date - Dec 08 , 2025 | 06:03 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Baoyapati Sreenu) కాంబోలో రూపొందిన అఖండ-2-తాండవం (Akhanda- 2 Thandavam) ఎంతో హైప్ క్రియేట్ చేసింది.

Nandamuri Balakrishna:

Nandamuri Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Baoyapati Sreenu) కాంబోలో రూపొందిన అఖండ-2-తాండవం (Akhanda- 2 Thandavam) ఎంతో హైప్ క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. అన్ని బావుంటే ఈపాటికి రిలీజ్ కూడా అయ్యేది. కానీ, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అఖండ-2 అనుకున్నట్టుగా డిసెంబర్ 5న రిలీజ్ కాలేక పోయింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అని అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కొందరు అయితే ఏకంగా ఇదే డేట్ అని కూడా చెప్పుకొస్తున్నారు. కొత్త విడుదల డేట్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

ఆదివారం నందమూరి బాలకృష్ణతో దిల్ రాజు, శిరీష్, 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటు స్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కూడా జరిగింది. డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీల్లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకపక్క ఓవర్సీస్ పంపిణీదారులు డిసెంబరు 12 నే సినిమాల విడుదల చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇటుపక్క క్రిస్మస్ కు సినిమా రిలీజ్ అయితేనే వర్కౌట్ అవుతుందని లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి కష్టసమయంలో నిర్మాతలకు బాలయ్య అండగా నిలబడ్డాడు. సహాయం చేయడంలో బాలయ్య ఎప్పుడు ముందు ఉంటాడు అని అందరికీ తెల్సిందే. అఖండ 2 రిలీజ్ కావాలని తనవంతు సాయం ఆయన చేశాడు. అఖండ2 సినిమాను గానూ బాలకృష్ణ పారితోషికం 45 కోట్లుగా ప్రచారంలో ఉండగా.. ఆయన రూ. 10 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిర్మాతల నుంచి ఇంకా తనకు రావాల్సిన రూ. 7 కోట్లను కూడా బాలయ్య వదిలేసినట్లుగా సమాచారం. అంతే మొత్తం రూ. 17 కోట్లు బాలయ్య నిర్మాతలకు ఇచ్చేసినట్లే. ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ అది బాలయ్య అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నిర్మాతలతో సెటిల్మెంట్ కు అందుబాటులో లేని ఏరోస్ సంస్ద అధినేతలు.. తమకు రావాల్సిన 28 కోట్లు కటాల్సిందేనని.. అందుకు తగ్గటుగా ఎన్ఓసి సిద్దం చేసి,వారు ఫారిన్ వెళ్లినట్లుగా సమాచారం. ఇంకోపక్క డిసెంబర్ 5 న అఖండ2 రిలీజ్ అవుతుందనని భావించిన పలువురు ఎగ్జిబిటర్స్ ..‌ పది రూపాయల వడ్డీలకు అప్పులు తీసుకుని అఖండ 2 ను తమ ధియేటర్స్ లో ప్రదర్శించెందుకు పంపిణీదారులకు డబ్బులు కూడా కట్టారు. సినిమా వీలైనంత త్వరగా రిలీజ్ కాకుంటే , అలాంటి ఎగ్గిబిటర్స్ కు ఆర్దికంగా ఇబ్బంది పడతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇన్ని సమస్యల మధ్యలో అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Updated Date - Dec 08 , 2025 | 06:03 PM