సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Renu Desai: స్త్రీ స్థానం కేవలం అక్కడే కాదు.. పవన్ ఫ్యాన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేణు

ABN, Publish Date - Sep 12 , 2025 | 03:52 PM

అభిమానం.. ఎప్పుడు ఒకరికి మంచి చేసేదిగానే ఉండాలి కానీ, హాని కలిగించకూడదు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు అని చెప్పుకుంటూ చాలామంది హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు.

Renu Desai

Renu Desai: అభిమానం.. ఎప్పుడు ఒకరికి మంచి చేసేదిగానే ఉండాలి కానీ, హాని కలిగించకూడదు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు అని చెప్పుకుంటూ చాలామంది హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దానివలన వారి కుటుంబాలు కూడా సఫర్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఒక్క మాట కూడా ఫ్యాన్స్ పడనివ్వరు. ఇక పవన్ ను ఏ రేంజ్ లో అయితే అభిమానిస్తారో.. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) ను కూడా పవన్ ఫ్యాన్స్ అలానే అభిమానిస్తారు.


పవన్ కు విడాకులు ఇచ్చాకా రేణు.. ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తుంది. ఇక పవన్ నుంచి విడిపోయాకా రేణు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. రెండో పెళ్లి చేసుకుంటే బాగోదని, ఇప్పటికీ నువ్వు మా వదినవే.. మా అన్నకు భార్యవి కాకపోయినా అకీరాకు తల్లివే.. అకీరా పవన్ కొడుకు అని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో రేణు చాలాసార్లు పవన్ ఫ్యాన్స్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది. పెళ్లి గురించి ఆలోచించడం మానేసింది. కామెంట్స్ సెక్షన్ కూడా ఆపేసింది. అయినా ఎక్కడో ఒకచోట ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. రేణు వాటికి గట్టి సమాధానం చెప్తూనే ఉంది.


తాజాగా ఒక కొలాబరేట్ వీడియో కింద పవన్ ఫ్యాన్.. అకీరా గురించి ఆమె రెండో పెళ్లి గురించి ఒక కామెంట్ పెట్టాడు. ' వదినా.. నేను ఇప్పుడే మీ ఇంటర్వ్యూలు అన్ని చూసాను. అకీరా.. మీ కొడుకే. కానీ, మా ఫ్యాన్స్ దృష్టిలో మా OG (పవన్ కళ్యాణ్) మరియు మీరు విడిపోలేదు. ఇంకా భార్యాభర్తలుగానే ఉన్నారు. మీ జీవితంలో పవన్ స్థానంలో మరొక వ్యక్తిని మేము చూడలేము. అకీరా మా అన్నయ్య కొడుకు అని మేము అంటామని చెప్పారు. అవును.. అతను మా అన్నయ్య కొడుకే. అలా అనడంలో మీరు కూడా ఉన్నారు. మగవాడు బిడ్డకు జన్మనివ్వలేడు కదా. అందుకే ఆయన ఎప్పుడు మా అన్నయ్య.. నువ్వెప్పుడూ మా వదిన. మేమెప్పుడూ అలాగే గౌరవిస్తాం' అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ కు రేణు గట్టి కౌంటర్ ఇచ్చింది.


ఈ కామెంట్ ను షేర్ చేస్తూ రేణు.. ' ఈ అబ్బాయి/అమ్మాయికొద్దిగా చదువుకున్నట్లు ఉన్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్‌లో తన సొంత ఇమెయిల్ ఐడిని సృష్టించుకుని, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి కొలాబరేట్ వీడియో కింద కామెంట్ పెడుతున్నాడు. మనమందరం 2025లో ఉన్నాము కానీ, మనలో పితృస్వామ్యం ఎంతగా పాతుకుపోయిందంటే, నేటికీ చాలా మంది ప్రజలు స్త్రీ.. కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని నమ్ముతున్నారు. ఆమెకంటూ ఒక స్వేచ్ఛ లేదు. నేటికీ మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుమతి అవసరం. నేటికీ చాలా మంది పురుషులు స్త్రీ స్థానం వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడం, వంటగదిలో ఉందని భావిస్తారు.


నేను, ఈ మనస్తత్వానికి వ్యతిరేకంగా నా స్వరం వినిపించడానికి ముందుటాను. నా స్నేహితులు, నా అనుచరులు నా గురించి ఏమనుకుంటారో అని భయపడి చెప్పకుండా ఆగిపోను. భవిష్యత్ తరాల మహిళలలో మార్పుకు మార్గం సుగమం చేయడానికి నేను ఒక స్త్రీగా మరియు ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నాను. స్త్రీవాదం అంటే వారాంతాల్లో టేబుల్ టాప్‌లపై తాగి తిరగడం కాదు, మహిళలను పశువులుగా, వస్తువులుగా చూసే వారిని ప్రశ్నించడం. ఇప్పుడు కాకపోయినా.. వచ్చే తరాల్లో అయినా స్త్రీలు ఈ ప్రపంచంలో తమదైన స్థానాన్ని కనుగొంటారని, గర్భంలనే ఆడ శిశువును చంపకుండా, వరకట్న హత్యలు, పరువు హత్యలు జరగకుండా ఆపుతారని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Anushka Shetty: ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్లీ అక్కడికే’ షాకింగ్‌ డెసిషన్‌..

Mirai Review: తేజ స‌జ్జా.. మిరాయ్ సినిమా రివ్యూ

Updated Date - Sep 12 , 2025 | 03:53 PM