Anushka Shetty: ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్లీ అక్కడికే’ షాకింగ్ డెసిషన్..
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:51 PM
స్వీటీ అనుష్క సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ. సినిమా ప్రమోషన్స్, తనకు సంబంధించిన సంగతులు పంచుకోవడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారామె!
స్వీటీ అనుష్క (Anushka) సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ. సినిమా ప్రమోషన్స్, తనకు సంబంధించిన సంగతులు పంచుకోవడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారామె! ఇటీవల ‘ఘాటి’ (Ghaati) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాకు కొంతకాలం విరామం తీసుకుంటునట్లు ఆమె ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్లీ అక్కడికే’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నీలి కాంతిని దీపకాంతిగా మార్చుకుంటూ, కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా (Anushka Social media Break) ఉండాలనుకుంటున్నా. ఎప్పుడూ స్క్రోలింగ్ చేసే లైఫ్‌కు దూరంగా.. నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎక్కడ మొదలయ్యానో అక్కడికే’, త్వరలోనే మరిన్ని కథలు, మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను. ఎప్పుడూ నవ్వుతూ, ప్రేమతో ఉండండి’ అని రాసిన లెటర్‌ను పోస్ట్ చేశారు అనుష్కశెట్టి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అనుష్క సోషల్ మీడియాకు ఎందుకు దూరమైంది అని ప్రశ్నలు కురిపిస్తున్నారు అభిమానులు.
తాజాగా ఆమె నటించిన 'ఘాటి' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ప్రస్తుతం ఆమె చేతిలో కథానార్ అనే చిత్రం ఒకటే ఉంది. మలయాళంలో ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.