Renu Desai: పవన్ మాజీ భార్య సన్యాసం.. దండం పెట్టి చెప్తున్నా అంటూ వీడియో రిలీజ్
ABN, Publish Date - Oct 22 , 2025 | 08:32 PM
సీనియర్ నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా రేణు.. అందరికీ సుపరిచితమే.
Renu Desai: సీనియర్ నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా రేణు.. అందరికీ సుపరిచితమే. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె.. పవన్ ను ప్రేమించి, పెళ్ళాడి, విడాకులు ఇచ్చి.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా నివసిస్తుంది. ఇక చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న రేణు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మరో సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు సమాచారం.
ఇక రేణు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. జంతు సంరక్షణ గురించి, వివిధ అంశాల గురించి తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే రేణు ఒక ఇంటర్వ్యూలో తాను సన్యాసం తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో నిజంగానే రేణు సన్యాసం తీసుకుంటుందేమో అనుకోని షాక్ అయ్యారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది వేరు.. కొన్ని మీడియా సైట్స్ రాసింది వేరు.
తాజాగా ఆ వార్తలపై రేణు దేశాయ్ స్పందించింది. తాను సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లు తెలిపింది. తన పిల్లలు ఇంకా చిన్నవారే అని.. వారిని వదిలేసి సన్యాసం తీసుకొనేంత బాధ్యత లేని తల్లిని కాదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. కెరీర్ లో అన్ని చేశారు.. హీరోయిన్ గా నటించారు.. అన్ని చూసారు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అంటే సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లు రేణు తెలిపింది. తనకు దేవుడి మీద భక్తి ఉంది కానీ, అది పిల్లల తరువాతనే అని, తన వయస్సు ఇంకా 45 మాత్రమే అని.. 65 వచ్చాకా సన్యాసం తీసుకుంటానని తెలిపింది.
ఇక మీడియా రాసే వార్తలు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతాయని, ఇలాంటి వార్తల కంటే చాలా సమస్యలు సమాజంలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. వాటి గురించి మాట్లాడితే బావుంటుందని దండం పెట్టి చెప్తున్నా ఇలాంటి వార్తలను హైలైట్ చేయొద్దని కోరింది. ప్రస్తుతం రేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
NTR: ఎన్టీఆర్ మార్ఫింగ్ వీడియోలు.. సజ్జనార్ ను ఆశ్రయించిన ఫ్యాన్స్
Kaantha: అమ్మడివే సాంగ్.. మహానటిని గుర్తు చేస్తుందేంటి