Kaantha: అమ్మడివే సాంగ్.. మహానటిని గుర్తు చేస్తుందేంటి
ABN , Publish Date - Oct 22 , 2025 | 06:59 PM
మహానటి సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).
Kaantha: మహానటి సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). సీనియర్ హీరో మమ్ముట్టి కుమారుడే అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయిన దుల్కర్ ఈ మధ్య కొత్త లోక సినిమాతో నిర్మాతగా కూడా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రాల్లో కాంత ఒకటి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ సరసనా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాంత.. నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అమ్మడివే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ వీడియో చూస్తుంటే మహానటి సినిమాలో మూగ మనసులు సాంగ్ గుర్తు వస్తుంది. సినిమాలో సినిమా నటుల మధ్య మొదలైన ప్రేమ కథగా కాంత తెరకెక్కింది. హీరో, హీరోయిన్లు సెట్ లో ఎలా ప్రేమలో పడతారో.. ఇక్కడ కూడా దుల్కర్,, భాగ్యశ్రీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
మహానటి సినిమాలో సావిత్రి- జెమిని గణేశన్ లానే ఇక్కడ దుల్కర్,, భాగ్యశ్రీ కనిపించారు. దుల్కర్ లుక్ కూడా జెమినీ గణేశన్ గుర్తుచేస్తుంది. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. జాను చంథర్ మ్యూజిక్ చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ మెలోడీ సాంగ్ వింటున్నంతసేపు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Thursday TV Movies: గురువారం, Oct 23.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Kantara : Chapter 1: అక్టోబర్ 31 నుండి ఆంగ్లంలోనూ...