Reba Monica John: కూలీ.. చాలా డిస్సప్పాయింట్ అయ్యాను
ABN, Publish Date - Sep 24 , 2025 | 07:11 PM
కోలీవుడ్ నటి రెబా మోనికా జాన్ (Reba Monica John) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Reba Monica John: కోలీవుడ్ నటి రెబా మోనికా జాన్ (Reba Monica John) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామజవరగమన సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. మ్యాడ్ 2 లో నా ముద్దుపేరు పెట్టుకున్నా స్వాతి రెడ్డి అనే సాంగ్ తో టాలీవుడ్ మొత్తానికి స్వాతి రెడ్డిగా మారిపోయింది. ఇక ఈ సినిమాలతో అమ్మడు నెమ్మదిగా టాలీవుడ్ లో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక తమిళ్ లో కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించిన రెబా.. రజినీకాంత్ నటించిన కూలీలో ఒక చిన్న పాత్రలో నటించింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించినవారందరూ స్టార్సే. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని కాకుండా సినిమాలో ఉన్న ప్రతి పాత్రకు బాగా పేరు ఉన్న నటులనే వాడాడు లోకేష్. అందులోనూ రజినీ సినిమా అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. అలానే రెబా కూడా కూలీలో ఒక పాత్రకు ఒప్పుకుంది. శృతి హాసన్ ఇద్దరు చెల్లెళ్లలో పెద్ద చెల్లిగా ఆమె నటించింది. నిజం చెప్పాలంటే అది అంత పెద్ద పాత్ర కాదు. అసలు ఆ పాత్రలో ఎవరు చేసినా వారికి అంత గుర్తింపు రాదు. అయినా రెబా ఆ పాత్రలో నటించింది.
కూలీ చూసిన వారికి అర్రే ఈ అమ్మాయి ఏంటి ఈ పాత్ర చేసింది అని అనిపించక మానదు. కానీ రెబా ఈ పాత్ర చేసింది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఆమె అందులో నటించినందుకు నిరాశ చెందినట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ' కూలీ విషయంలో నేను చాలా డిస్సప్పాయింట్ అయ్యాను. కానీ, కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. కూలీ నేను అనుకున్నట్లు తెరకెక్కలేదు. నా పాత్ర ఇంకాస్త ఉంటే బావుండేది అనిపించింది. కానీ, రజినీకాంత్ సినిమాలో నటించడం నాకు ఆనందంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Krithi Shetty: ఉప్పెన భామ.. హిట్ అందుకొనే తరుణం ఎప్పుడో
OG: తెలంగాణలో తొలిసారిగా కాన్ ప్లెక్స్ సినిమాస్