Thankyou Dear: బర్నింగ్ ఇష్యూ తో 'థ్యాంక్యూ డియర్'
ABN , Publish Date - Jul 30 , 2025 | 02:41 PM
స్వర్గీయ, రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ నటించిన సినిమా 'థ్యాంక్యూ డియర్'. హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 1న విడుదల కాబోతోంది.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishnavamsi) వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'ధ్యాంక్యూ డియర్' (Thank you Dear). పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 1న విడుదల కాబోతోంది. రియల్ స్టార్ శ్రీహరి (Srihari) సోదరుడు శ్రీధర్ తనయుడు ధనుష్ రఘుముద్రి (Dhanush Raghumudri) హీరోగా నటించిన సినిమా ఇది. గత యేడాది ధనుష్ నటించిన 'తంత్ర' (Thantra) మూవీ వచ్చింది. ఈ తాజా చిత్రంలో హెబ్బా పటేల్ (Hebhah Patel), రేఖ నిరోషా (Rekha Nirosha) హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ తెలిపారు. ఈ సినిమా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ప్రదర్శిచామని అన్నారు. అలానే 15వ గోవా ఇంటర్నేనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాగా పలు అవార్డులు లభించాయని అన్నారు. అలానే బెంగళూరు ఇండియా ఆర్ట్ అండ్ లిటరేచర్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ వెల్రెడ్ అసోసియేషన్ లో ఈ సినిమాను ప్రదర్శించగా నటీనటులకు అవార్డులు దక్కాయని తెలిపారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శ్రీకాంత్ తోట మాట్లాడుతూ, 'ఈ సినిమాను ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ టాపిక్ మీద తీశాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే లో ఉండబోతుంది. ఒక మంచి సందేశంతో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని రూపొందించాం. దీనికి ఇప్పటికే ఎన్నో అవార్డులు రావడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ రఘుముద్రి, హీరోయిన్ రేఖ నిరోషా, నిర్మాత బాలాజీ లైన్ ప్రొడ్యూసర్ పునీత్ , సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ తదితరులు పాల్గొని సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు.
Also Read: Kingdom: అందరి ఆశలూ దానిపైనే!
Also Read: Param Sundari: జాన్వీ కపూర్.. పరమ్ సుందరి రిలీజ్ డేట్ వచ్చేసింది