Param Sundari: జాన్వీ కపూర్.. పరమ్ సుందరి రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:58 PM

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, జాన్వీ క‌పూర్ జంట‌గా కేర‌ళ నేప‌థ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా తెర‌కెక్కిన‌ చిత్రం ప‌ర‌మ్ సుంద‌రి.

Janhvi Kapoor

బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) జంట‌గా కేర‌ళ నేప‌థ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా తెర‌కెక్కిన‌ చిత్రం ప‌ర‌మ్ సుంద‌రి (Param Sundari). తుషార్ జ‌లోటా (Tushar Jalota) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఇటీవ‌ల‌ స్త్రీ, ముంజియా, ఛావా వంటి వ‌రుస‌ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో నార్త్‌లో దూసుకుపోతున్న మ‌డాక్ ఫిలింస్ (maddock films) ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఇప్ప‌టికే జూలై 25న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డింది.

అయితే మేక‌ర్స్ బుధ‌వారం ఈ మూవీ నుంచి ప‌ర‌దేశియా (Pardesiya) అంటూ సాగే ఓ మెలోడీతో సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అమితాబ్ బ‌ట్టాచార్య (Amitabh Bhattacharya)ఈ పాట‌కు సంగీతం అందించ‌గా స‌చిన్ జిగార్ సంగీతం అందించారు. సోను నిగ‌మ్ (Sonu Nigam), కృష్ణ‌క‌లి షా (Krishnakali Saha), స‌చిన్ జిగార్ (Sachin Jigar) ఆల‌పించారు. పాట సోల్ ఫుల్ మ్యూజిక్‌తో ఇట్టే మ‌న‌స్సును తాకేలా ఉంది. ముఖ్యంగా సోనూ నిగ‌మ్ వాయిస్ వింటూనే ఉండాలి అనేలా ఉంది. మీరూ ఓ సారి వినండి మీకూ తెలుస్తుంది.

ఇక మూవీ తిరిగి రిలీజ్ డేట్‌ విష‌యంలో అనుమానాలు నెల‌కొన్న సంద‌ర్బంలో చిత్ర బృందం ఈ పాటను రిలీజ్ చేసి సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ ఇచ్చింది. ప‌ర‌మ్ సుంద‌రి (Param Sundari) సినిమాను ఆగ‌స్టు 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్న‌ట్లు తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 02:02 PM