Kingdom: అందరి ఆశలూ దానిపైనే!
ABN , Publish Date - Jul 30 , 2025 | 02:06 PM
ఆ హీరోకు తప్పకుండా ఓ బంపర్ హిట్ కావాలి... ఆయనతో జోడీ కట్టిన హీరోయిన్ కు ఇప్పటి దాకా హిట్టే లేదు... కాబట్టి ఆమెకూ ఓ బ్రేక్ రావాలి... ఆ ఇద్దరినీ కలిపిన సినిమా 'కింగ్ డమ్'... ఆ మూవీ డైరెక్టర్ పరిస్థితి కూడా అదే... ఆ హీరో-హీరోయిన్ - డైరెక్టర్ ఎవరో తెలిసిపోయిందిగా....
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు 'గీత గోవిందం' (Geetha Govindam) తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ పలకరించలేదు... అంటే దాదాపు విజయ్ కి సరైన హిట్ లేక ఏడేళ్ళవుతోంది... అయినా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే అందరినీ ఆకట్టుకుంటున్నారు విజయ్... ఈ నేపథ్యంలో విజయ్ తాజా చిత్రం 'కింగ్ డమ్' (Kingdom) పైనే ఆయన ఆశలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పక తప్పదు... గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri ) దర్శకత్వంలో రూపొందిన 'కింగ్ డమ్' ఈ నెల 31న విడుదల కానుంది... ఇదే సినిమాపై హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కూడా ఆశలు పెట్టుకుంది... ఇప్పటి దాకా భాగ్యశ్రీ నటించిన ఏ చిత్రమూ సక్సెస్ రూటులో సాగలేదు... ఆమె నటించిన తొలి తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్' (Mr. Bachchan) మురిపించలేకపోయింది... అందువల్ల భాగ్యశ్రీ సైతం 'కింగ్ డమ్'పైనే బోలెడు ఆశతో ఉంది... డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మొదటి సినిమా 'మళ్ళీ రావా'(Malli Raava) తో పరవాలేదనిపించారు... 'జెర్సీ' (Jersey) సినిమా వల్ల గుడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు... హిందీ 'జెర్సీ'తో పరాజయం చవిచూశారు... అందువల్ల డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి కూడా 'కింగ్ డమ్' సక్సెస్ అత్యంత అవసరం... మరి ఈ ముగ్గురికీ 'కింగ్ డమ్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నదే సినీఫ్యాన్స్ లో చర్చగా మారింది...
కలిసొచ్చే అంశాలు...
కొన్నిసార్లు మైనస్ లన్నీ ఒక చోట చేరినప్పుడు 'బిగ్ ప్లస్' వస్తుందని అంటారు... అలా గతంలో కొన్ని కాంబినేషన్స్ గ్రాండ్ సక్సెస్ చూశాయి... 'గబ్బర్ సింగ్' (Gabbar Singh) సమయంలో హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్, హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఇలాగే మైనస్ లో ఉన్నారు...ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అందరికీ ఆనందం పంచింది...అదే తీరున 'కింగ్ డమ్' కూడా విజయ్, భాగ్యశ్రీ, గౌతమ్ కు కలసి వస్తుందని కొందరు అంటున్నారు... ఇక ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ప్రస్తుతం పట్టిందల్లా బంగారం చేసుకుంటూ సాగుతున్నారు... పైగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander ) సంగీతం సమకూర్చారు... అనిరుధ్ స్వరకల్పనలో రూపొందిన పలు చిత్రాలు జయకేతనం ఎగురవేస్తున్నాయి... అందువల్ల 'కింగ్ డమ్' విజయ్, గౌతమ్, భాగశ్రీ ముగ్గురికీ కలసి వస్తుందనీ యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు...
అదే 'కింగ్ డమ్'కు రక్ష...
ఇటీవల జరిగిన 'కింగ్ డమ్' ప్రీ రిలీజ్ వేడుకలోనూ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ మాటల్లో ఈ సినిమాపై వారికి ఎన్ని ఆశలు ఉన్నాయో ఇట్టే అర్థమై పోయింది... ప్రీ రిలీజ్ వేడుకలో వక్తల్లో పలువురు నిర్మాత నాగవంశీని, సంగీత దర్శకుడు అనిరుధ్ ను విశేషంగా ప్రశంసించారు... దీనిని బట్టే వారి లక్ 'కింగ్ డమ్'కు రక్ష అని తెలుస్తోంది... ఈ వేడుకలో గౌతమ్ తిన్ననూరి పాల్గొనలేక పోయారు... సినిమాకు కావలసిన టెక్నికల్ తలుకులు అద్దడంలో గౌతమ్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది... ఈ మూవీని ఓ యజ్ఞంలా భావించి గౌతమ్ పనిచేస్తున్నారు... జూలై 31వ తేదీన రిలీజవుతున్న 'కింగ్ డమ్' ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుందో, విజయ్, భాగ్యశ్రీ, గౌతమ్ కు ఎలాంటి ఆనందం పంచుతుందో చూడాలి...
Read Also: Param Sundari: జాన్వీ కపూర్.. పరమ్ సుందరి రిలీజ్ డేట్ వచ్చేసింది
Read Also: Rishab Shetty: తెలుగులో.. రిషబ్ షెట్టి పీరియడ్ డ్రామా! ఫస్ట్ లుక్ అదిరింది