Raviteja 76: రవితేజ76 రెగ్యులర్ షూట్ షురూ
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:46 PM
రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం #RT76 తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.
రవితేజ(Raviteja), కిషోర్ తిరుమల (Kishore tirumala) దర్శకత్వంలో కొత్త చిత్రం #RT76 తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. సోమవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణంపై ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాని రాశారు. రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు. భీమ్స్ సిసిరోలియో మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం రవితేజతో కలిసి పని చేస్తున్నారు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. #RT76 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ALSO READ: Film Awards : రిపీట్ అయ్యింది పెళ్ళిచూపులు మాత్రమే...
Kantara 2: కాంతార సెట్లో మరణాలు.. రిషబ్‌కు పూజారులు హెచ్చరిక..
Monalisa: తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్...
Rashmika Mandanna: ఆ హీరోల నుంచి అవి.. విజయ్ నుంచి అన్నీ కావాలి