Ravi Teja: రూట్ మార్చిన మాస్ మ‌హారాజ్‌.. లైన్‌లో నాలుగు డిఫ‌రెంట్ సినిమాలు

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:17 PM

మాస్ మహరాజా రవితేజ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి విడుదలకు సిద్థంగా ఉండగా, మరొకటి సెట్స్ మీద ఉంది. మరో రెండు సినిమాలను రవితేజ లైన్ లో పెట్టి ఉంచాడు. ఇవన్నీ డిఫరెంట్ జానర్స్ చిత్రాలు కావడం విశేషం.

Ravi Teja Movies

మాస్ మహరాజా రవితేజ (Raviteja) కు సాలీడ్ హిట్ పడి చాలా కాలమే అయ్యింది. చిరంజీవితో కలిసి రవితేజ నటించిన 'వాల్తేరు వీరయ్య' తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ ను రవితేజ చూడలేదు. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మాత్రం రవితేజ చేసేస్తున్నాడు. అక్టోబర్ 31న రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara) జనం ముందుకు రాబోతోంది. 'ధమాకా' (Dhamaka) తర్వాత శ్రీలీల (Sreeleela) మరోసారి ఈ సినిమాలో రవితేజతో జోడీ కట్టింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు బాగానే అలరిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ కు చెందిన సినిమా.


ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 76వ చిత్రానికి కూడా ఒకప్పటి రచయిత కిశోర్ తిరుమల (Kishore Thirumala) దర్శకత్వం వహిస్తున్నాడు. 'నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్' వంటి రొమాంటిక్, యాక్షన్ మూవీస్ ను తీసిన అనుభవం కిశోర్ తిరుమలకు ఉంది. పైగా అతనిది మంచి పెన్. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మొదట్లో 'అనార్కలి' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడీ సినిమాకు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే పేరు పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాబోయే సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా నిలుస్తుందని అంటున్నారు. ఇది ఫ్యామిలీ డ్రామా.


ఇక రవితేజ చేయబోతున్న 77వ చిత్రాన్ని శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. 'నిన్ను కోరి, మజిలి, టక్ జగదీశ్‌, ఖుషీ' సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈసారి థిల్లర్ డ్రామాను తీయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. ఇందులో రవితేజ తన వయసుకు తగ్గ పాత్ర చేస్తాడని అంటున్నారు.

ఇక రవితేజ చేయబోతున్న 78వ సినిమాను కళ్యాణ్‌ శంకర్ డైరెక్ట్ చేస్తాడని సమాచారం. 'మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్' చిత్రాలను డైరెక్ట్ చేసిన కళ్యాణ్‌ శంకర్ (Kalyan Shankar) నిజానికి 'టిల్లూ క్యూబ్' కు డైరెక్ట్ చేయాల్సి ఉంది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు కళ్యాణ్ శంకర్... ఆ సినిమాను పక్కన పెట్టి రవితేజతో ఓ సూపర్ హీరో మూవీ చేస్తాడని సమాచారం.

సో... 'మాస్ జాతర' తర్వాత నాగవంశీ... రవితేజతో తీయబోయే సినిమా ఇది. ఇలా... వరుసగా నాలుగు డిఫరెంట్ జానర్స్ తో రవితేజ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ చిత్రాలలో ఏవేవి రవితేజను తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తాయో చూడాలి.

Also Read: Ram Talluri: పవన్ చేతుల మీదుగా...

Also Read: Bigg Boss 9: 'బిగ్ బాస్'తో సమాజానికి ఏం  సందేశం ఇస్తున్నారంటూ ఫైర్ 

Updated Date - Oct 16 , 2025 | 05:37 PM