Ram Talluri: పవన్ చేతుల మీదుగా...

ABN , Publish Date - Oct 16 , 2025 | 01:36 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేతుల మీదుగా నిర్మాత రామ్ తాళ్ళూరి జనరల్ సెక్రటరీ పదవికి సంబంధించిన పత్రాలను స్వీకరించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం తన వంతు కృషి చేస్తానని రామ్ తాళ్ళూరి హామీ ఇచ్చారు.

Pawan Kalyan - Ram Talluri

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్‌ ఇటీవల ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి ని జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఈ బాధ్యతలను రామ్ తాళ్ళూరి స్వీకరించారు. పవన్ కళ్యాణ్‌ ను కలిసి, ఆయన చేతులు మీదుగా అధికారిక పత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు రామ్ తాళ్ళూరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి సేవ చేసే అవకాశాన్ని తనకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు రామ్ ధన్యవాదాలు తెలుపుతూ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.


ram pawan1.jpeg

కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీకి రామ్ తాళ్ళూరి మద్దత్తు ఇస్తున్నారు. 2024 లో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం రామ్ తాళ్ళూరి కృషి చేశారు. ఇక నిర్మాతగా రామ్ తాళ్ళూరి.... రవితేజతో 'నేల టిక్కెట్, డిస్కో రాజా', వరుణ్‌ తేజ్ 'తో 'మట్కా', విశ్వక్ సేన్ తో 'మెకానిక్ రాకీ' వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సైతం గతంలో జరిగాయి. కానీ పవన్ కళ్యాణ్‌ ఎన్నికల్లో విజయం సాధించి, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెట్స్ మీద ఉన్న సినిమాలను మాత్రమే పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరి రామ్ తాళ్ళూరి సినిమాను కూడా ఆయన పట్టాలెక్కించి, పూర్తి చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ సినిమా వక్కంతం వంశీ రచన చేశారు.

Also Read: Saamrajyam: వెట్రిమారన్ 'సామ్రాజ్యం'.. ఎన్టీఆర్ మాటసాయం

Also Read: Ari Movie: ఎన్నో సినిమాల ప్రేరణే ఈ సినిమా 

Updated Date - Oct 16 , 2025 | 01:36 PM