Ravi Teja: నో రెమ్యునరేషన్.. రవితేజపై ఆ మాట పోగొట్టడానికే..
ABN, Publish Date - Dec 22 , 2025 | 10:19 AM
భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి రవితేజ రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఒక్క రూపాయి పారితోషకం తీసుకోకుండానే సినిమాకు పనిచేశారని నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పారు.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). కిశోర్ తిరుమల (kishore Tirumala) దర్శకుడు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ నాయికలు. అయితే ఈ చిత్రానికి రవితేజ రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఒక్క రూపాయి పారితోషకం తీసుకోకుండానే సినిమాకు పనిచేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పారు. ఇప్పటివరకు రవితేజ గారికి రూపాయి రెమ్యూనిరేషన్ ఇవ్వలేదని అన్నారు. లాభాల్లోనే వాటా తీసుకోవాలనే ఒప్పందంతో ఈ సినిమా చేశారని తెలిపారు. రవితేజకి రెమ్యూనిరేషన్ ఉంటే చాలు కథ గురించి పెద్దగా పట్టించుకోరు అనే టాక్ ఉంది. కానీ అది నిజం కాదని ఈ సినిమాతో రుజువు అయింది. అంతేకాదు సంక్రాంతికి తీసుకురావాలని ఉద్దేశంతోనే ఈ సినిమా చేశారు. ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సంక్రాంతి ఆడియన్స్‌కి నచ్చే అంశాలు. అందుకే సినిమా సైన్ చేసినప్పుడే సంక్రాంతి వస్తేనే చేస్తానని ఒప్పందం చేసుకున్నారు. అందుకే ఇంత పోటీలోనూ సంక్రాంతి బరిలో వస్తున్నాం అని నిర్మాత వెల్లడించారు.
రవితేజ అంటేనే మాస్, మసాలా. ఈ మధ్య అన్ని అలాంటి పాత్రలే చేశారు. కానీ ఏదీ కలిసి రాలేదు. అసలు తనకు సంబంధం లేని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయమని చెప్పడంతో డైరెక్టర్ కిషోర్ తిరుమల తన సెన్సిబిలిటీ తగ్గట్టుగా ఈ కథని, ఒక క్యారెక్టర్ని రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ నచ్చి రవితేజ ఈ సినిమా చేశారు. ఇది మొత్తం కిషోర్ తిరుమల టచ్ ఉండే సినిమా. టీజర్, సాంగ్స్ చూస్తుంటే కిశోర్ సినిమాలా ఉంది. రవితేజ ప్రెష్ లుక్‌లో ఉన్నారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.