Mass Jathara: రవితేజ.. మాస్ జాతర టీజర్ వచ్చేసింది
ABN, Publish Date - Aug 11 , 2025 | 11:31 AM
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న75వ చిత్రం మాస్ జాతర టీజర్ వచ్చేసింది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న75వ చిత్రం మాస్ జాతర (Mass Jathara). శ్రీలీల (Sreeleela) కథానాయిక. భాను భోగవరపు (Bhanu Bogavarapu) దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెలాఖరున థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి వేగం పెంచారు. ఆగస్టు27న సినిమా ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.