Mass Maharaja: పాట చిత్రీకరణలో రవితేజ సినిమా
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:06 PM
రవితేజ కొత్త సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ కలర్ ఫుల్ సెట్ ను వేశారు.
మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara) ఇటీవలే జనం ముందుకు వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా అభిమానులను సైతం నిరాశ పర్చింది. 'మాస్ జాతర' పరాజయాన్ని పట్టించుకోకుండా రవితేజ మాత్రం తన 76వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కిశోర్ తిరుమల (Kishore Thirumala) దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ (Ashika Ranganadh) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ డాన్స్ నంబర్ కోసం ఫ్లోర్ లో భారీ సెట్ ను వేశారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఈ డాన్స్ నంబర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ను బిగ్ కాన్వాస్ లో హోల్సమ్ ఎంటర్ టైనర్ గా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారని సుధాకర్ చెరుకూరి తెలిపారు. రవితేజ 'మాస్ జాతర'కు సంగీతాన్ని సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకూ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఎమోషనల్ కథాంశాలను తెరకెక్కించడంలో సిద్థహస్తుడైన కిశోర్ తిరుమల ఈ సినిమాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఇందులో న్యూ స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నారని సుధాకర్ చెరుకూరి చెబుతున్నారు. మరి గత కొన్నేళ్ళుగా సరైన సక్సెస్ లేక సతమతమౌతున్న రవితేజ ను ఈ సినిమా అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
Also Read: Bandla Ganesh: వాట్స్ అప్ అంటే రాదు సక్సెస్.. కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో రెచ్చిపోయిన బండ్లన్న..
Also Read: 50 Years Industry: మోహన్ బాబును ఘనంగా సత్కరించనున్న తనయుడు విష్ణు