Raviteja: క్లాస్ డైరెక్టర్ క్రైమ్ థ్రిల్లర్ అంటే.. సెట్ అవుతుందా రవన్న
ABN, Publish Date - Nov 16 , 2025 | 05:51 PM
మాస్ మహారాజా రవితేజ(Raviteja)కు విజయాపజయాలతో పని లేదు. సాధారణంగా హీరోలు ఎవరైనా ఒక సినిమా ప్లాప్ అయ్యింది అంటే నెలలు నెలలు బయట కనిపించరు. కానీ, రవితేజ అలా కాదు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ(Raviteja)కు విజయాపజయాలతో పని లేదు. సాధారణంగా హీరోలు ఎవరైనా ఒక సినిమా ప్లాప్ అయ్యింది అంటే నెలలు నెలలు బయట కనిపించరు. కానీ, రవితేజ అలా కాదు. ఒక సినిమా పోయింది.. మరో సినిమా తీయకుండా ఉంటామా అని నేనింతే సినిమాలో డైలాగ్ చెప్పేస్తాడు. సినిమా ప్లాప్ అయ్యిందని తెలిసిన మొదటి రోజే.. ఓకే నాకు వేరే సినిమా ఉంది.. దాని షూటింగ్ వెళ్లిపోతున్నా అని చెప్తాడట. అంత ప్రాక్టికల్ గా ఉంటాడు రవితేజ.
ఈ మధ్యనే మాస్ జాతర సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. అయినా కూడా వెంటనే భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. మన పని మనం చేసుకుంటూ పోవాలి.. అనేది రవితేజ నమ్ముతాడు. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ.. ఈ మధ్యనే మరో సినిమాను పట్టాలెక్కించాడని తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, ఖుషి లాంటి క్లాసిక్ లవ్ స్టోరీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత శివ తన ఫంథాను మార్చుకొని ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరిని రాసుకున్నది. ఆ కథనే రవితేజకు వినిపించడం.. ఆయనకు నచ్చడం జరిగిందని.. ఈ సినిమాను నవంబర్ చివరి వారంలో అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. శివ నిర్వాణ.. లవ్ స్టోరీస్ నుంచి బయటకు వచ్చి టక్ జగదీష్ లాంటి మాస్ యాక్షన్ సినిమాతో వచ్చాడు.. కానీ ప్రేక్షకులు ఆదరించలేదు. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అంటూ కొత్త ప్రయోగంతో వస్తున్నాడు. ఇది వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. మరి ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.