Ravi Teja: మాస్ మహారాజా ట్యాగ్ పక్కన పెట్టమన్న రవితేజ.. కారణం ఏంటి
ABN, Publish Date - Dec 20 , 2025 | 09:49 PM
టాలీవుడ్ హీరోల పేర్లు పూర్తిగా చెప్పనవసరం లేదు.. వారి ట్యాగ్స్ చెప్పేస్తే చాలు. అవే వారి బ్రాండ్. మెగాస్టార్, పవర్ స్టార్, కింగ్, విక్టరీ, ఐకాన్ స్టార్, గ్లోబల్ స్టార్, ఉస్తాద్, న్యాచురల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ , గాడ్ ఆఫ్ మాసెస్ .. ఇలా వారి ట్యాగ్స్ ని బట్టి హీరోల రేంజ్ ఉంటుంది.
Ravi Teja: టాలీవుడ్ హీరోల పేర్లు పూర్తిగా చెప్పనవసరం లేదు.. వారి ట్యాగ్స్ చెప్పేస్తే చాలు. అవే వారి బ్రాండ్. మెగాస్టార్, పవర్ స్టార్, కింగ్, విక్టరీ, ఐకాన్ స్టార్, గ్లోబల్ స్టార్, ఉస్తాద్, న్యాచురల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ , గాడ్ ఆఫ్ మాసెస్ .. ఇలా వారి ట్యాగ్స్ ని బట్టి హీరోల రేంజ్ ఉంటుంది. ఒకప్పుడు ఈ ట్యాగ్స్ కోసం ఫ్యాన్స్ యుద్దాలు చేసేవాళ్లు. ట్యాగ్ లేకుండా హీరో ఉండకూడదని ఫ్యాన్స్ కావాలనే తమ హీరోకు ఏదో ఒక స్టార్ అని పెట్టేవారట. అయితే ఇప్పుడు జనరేషన్ మారింది.. సినిమాలు చూసే ప్రేక్షకులు మారారు. ట్యాగ్స్ ను బట్టి కాదు కథను బట్టి చూస్తున్నారు. హిట్ అయితే హిట్.. ప్లాప్ అయితే ప్లాప్ అని నిర్మొహమాటంగా చెప్పుకొస్తున్నారు.
ఇక ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా తమను తాము మార్చుకుంటున్నారు. ఈ ట్యాగ్స్ ను వదిలేసి.. తమ పేర్లతోనే కొత్త ట్యాగ్ ను నిర్మించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేశాడు. తనను అలా పిలవద్దని చెప్పుకొచ్చాడు. అలానే గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని రామ్ చరణ్, ఉస్తాద్ అనే ట్యాగ్ ని రామ్ తమ పేర్లకు ముందు తొలగించి.. తమపై ఉన్న అధిక అంచనాల బరువును దింపుకున్నారు. ఇక ఇప్పుడు వీరి లిస్ట్ లో చేరిపోయాడు మాస్ మహారాజా రవితేజ. మాస్ మహారాజా ఈ పేరుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన మాస్ కి ఒక రేంజ్ ఉంది.
అయితే రవితేజకు ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ వచ్చింది లేదు. ఎంత మాస్ చూపించినా కూడా ప్రేక్షకులు ఆయనను తిప్పికొడుతూనే ఉన్నారు. కామెడీ చేసినా, యాక్షన్ చేసినా రొట్ట కథలే అని ముద్ర వేసేస్తున్నారు. ఇక దీంతో రవితేజ సైతం తన ముందు ఉన్న మాస్ మహారాజా ట్యాగ్ ని తొలగించుకున్నాడట. ఈ విషయాన్నీ డైరెక్టర్ కిషోర్ తిరుమల స్వయంగా చెప్పుకొచ్చాడు. రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతోంది. కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో మన తెలుగు ప్రేక్షకులకు మంచి ఫన్, సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుంది. రవితేజకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉద్దేశంతోనే ఈ కథ రాశాను. ఆయన మార్క్, ఫన్ మిస్ అవ్వకుండా నా ట్రీట్మెంట్ తో సినిమాని చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.
రవితేజకు ఈ కథ చెప్పినప్పుడు ముందే ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. నా గురించి కాకుండా నీ స్టైల్ లో కథ చేస్తే క్యారెక్టర్ ఫ్రెష్ నెస్ వస్తుందని చెప్పాడు. నేనెప్పుడూ కథను,పాత్రను బట్టే ముందుకు వెళ్తాను. అది నచ్చి.. రవితేజ ఈ సినిమాకు నా ట్యాగ్ మాస్ మహారాజా అని వేయొద్దు అని అన్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకు మాత్రం వేయొద్దు అంటే.. మిగతా సినిమాలకు ఈ ట్యాగ్ ఉంటుందా.. ? అనే అనుమానం అభిమానుల్లో ఉంది. అంటే కేవలం ఈ సినిమా క్రెడిట్ మొత్తం కిషోర్ కి రావాలని రవితేజ తన ట్యాగ్ ని వాడొద్దు అన్నాడా.. ? లేక మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టడానికి ట్యాగ్ తీసేయమన్నాడా అనేది తెలియాలి. మరి ఈ సినిమా హిట్ అయ్యి నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు అందులో మాస్ మహారాజా ట్యాగ్ ఉంటుందో లేదో చూడాలి.