సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ravi Teja ART Cinemas: ర‌వితేజ మ‌ల్టీఫ్లెక్స్ ఓపెనింగ్‌.. ఫీచ‌ర్స్‌ మాములుగా లేవుగా

ABN, Publish Date - Jul 30 , 2025 | 07:26 AM

మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్ త‌ర‌హాలో మాస్ మ‌హారాజా ర‌వితేజ సైతం బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Ravi Teja ART Cinemas

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌ర‌హాలో టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja ) సైతం బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వారి లాగానే ఏఆర్టీ సినిమాస్ (ART Cinemas) అంటూ మ‌ల్టీప్లెక్స్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ల్టీప్లెక్స్ మొఖం ఎరుగ‌ని హైద‌రాబాద్ తూర్పు (ఈస్ట్‌)లో ఏసియ‌న్ (Asian) సునీల్ భాగ‌స్వామ్యంతో నిర్మించిన‌ ఓ భారీ మ‌ల్టీఫ్లెక్స్‌ను గురువారం కింగ్డ‌మ్ (Kingdom) సినిమాతో గ్రాండ్‌గా ప్రారంభించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అండ్ టీమ్ రానున్న‌ట్లు స‌మాచారం. అయితే ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) హారిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu) సినిమాతోనే ఈ మ‌ల్టీఫ్లెక్స్‌ను ప్రారంభించాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ నిర్మాణానంత‌ర ప‌నుల వ‌ల్ల జాప్యం జ‌రిగింది.

ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది వాహానాల రాక‌పోక‌లు, ప్ర‌యాణికులు, స్థానికుల‌తో నిత్యం సంద‌డిగా ఉండే విజ‌య‌వాడ హైవేపై వ‌న‌స్థ‌లిపురం (Vanasthalipuram) ప్ర‌ధాన కూడ‌లిలో ఉన్న ఈ మ‌ల్లీఫ్లెక్స్ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌ కానుంది. కాగా ఈ మ‌ల్లీఫ్లెక్స్‌లో ఆరు స్క్రీన్లు ఉండ‌నుండ‌గా, ఇందుకోసం కోసం హై టెక్నాల‌జీని ఉప‌యోగించారు.

అలాగే ప్ర‌పంచ స్థాయి సినిమా అనుభ‌వం కోసం ప్ర‌త్యేకమైన ఫీచ‌ర్స్ ఉన్న 4కే క్వాలిటీ ప్రొజెక్షన్, అల్ట్రా క్లియర్ విజువల్స్‌తో 57 అడుగుల వెడల్పు భారీ స్క్రీన్ సైతం ఏర్పాటు చేశారు. వీటిలో 1, 2, 5, స్క్రీన్లు డాల్బీ 7.1 లేజ‌ర్‌ ప్రోజెక్ష‌న్ (dolby 7.1 with laser projection)తో ఉండ‌గా 3,4,6 స్క్రీన్లు డాల్బీ అట్మోస్ లేజ‌ర్‌ ప్రోజెక్ష‌న్‌ (dolby Atmos with laser projection )తో ఉన్నాయి. అయితే ఇందులొనే 6వ నంబ‌ర్‌ స్క్రీన్ ఎపిక్ (EPIQ screen) స్క్రీన్‌గా భారీగా ఉండ‌నుంది.

కాగా బుధ‌వారం ర‌వితేజ స‌మ‌క్షంలో పూజ‌లు నిర్వ‌హించి జూలై 31న విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ సినిమాతో ఈ మ‌ల్టీప్లెక్స్‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచి టికెట్లు సైతం అందుబాటులోకి రానుండ‌గా మ‌హావ‌తార్ న‌ర‌సింహా, హారిహ‌ర వీర‌మ‌ల్లు, ఫెంటాస్టిక్ ఫోర్‌, సియారా సినిమాలు సైతం ప్ర‌ద‌ర్శితం కానున్నాయి.

అయితే.. త‌త్వ మాల్‌గా పిల‌వ‌బ‌డే ఈ మాల్‌, ఈ మల్టీఫ్లెక్స్ ఎర్పాటుతో ఎన్నాళ్ల నుంచో ఎల్బీ న‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల చిర‌కాల కోరిక నెర‌వేరిన‌ట్లైంది. ప్ర‌సాద్స్, జీవీకే, ఇనార్బిట్ మాల్‌లో ఉండే షాపింగ్‌, కిడ్స్ ప్లే జోన్లు కూడా ఇందులో ఉండ‌నున్నాయి.

Updated Date - Jul 30 , 2025 | 07:26 AM