Bunny Vas - Allu Arjun: నేనేమీ మాట్లాడలేను.. ఏదైనా వాళ్లే చెప్పాలి..

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:33 PM

పుష్ప చిత్రాల సక్సెస్‌ తర్వాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా అప్‌డేట్‌ గురించి ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Bunny Vas


పుష్ప చిత్రాల సక్సెస్‌ తర్వాత అట్లీ (atlee)దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu arjun) చేస్తున్న సినిమా అప్‌డేట్‌ గురించి ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. బన్నీకి అత్యంత సన్నిహితుడు అయిన బన్ని వాస్‌కు ఈ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆయన తెలివిగా సమాధానమిచ్చారు.  ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ సింపుల్‌గా చెప్పేశారు. శ్రీచరణ్‌ రాచకొండ, గీత్‌ షైని జంటగా నటించిన చిత్రం ‘కన్యాకుమారి’ ఆగస్టు 27 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బన్నీ వాస్‌ మాట్లాడారు. ‘అల్లు అర్జున్‌, అట్లీ సినిమా గురించి ఏమైనా చెబుతారా’ అని అడగ్గా ‘సన్‌ పిక్చర్స్‌ వాళ్లతో నాన్‌ డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉంది. ప్రస్తుతం ఏమీ మాట్లాడలేను. ఏదైనా చెబితే వాళ్లే చెప్పాలి’ అని అన్నారు.


సినీ కార్మికుల సమ్మె షూటింగ్‌లపై ఏమైనా ప్రభావం చూపిందా అన్న ప్రశ్నకు.. ‘తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా ఆపాల్సిందే. అందరి మధ్య సమన్వయం ఉంటుంది. సమ్మె కారణంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డాం. ఇంకొన్నిసార్లు అభ్యర్థన మేరకు షూట్‌ చేశాం. ఎందుకంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. పైగా విదేశీ నిపుణులు మన దేశానికి వచ్చి వర్క్‌ చేస్తున్నారు.  సమ్మె జరిగితే వాళ్లందరినీ ఖాళీగా కూర్చోబెట్టాలి. అగ్రిమెంట్‌ ప్రకారం వాళ్లకు పనిలేకపోయినా, డబ్బులు చెల్లించాలి’ అని బన్నీ వాస్‌ అన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ మూడు కోణాల్లో సాగుతుందని సమాచారం. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలోపాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించే ఆస్కారం ఉంది.

Updated Date - Aug 25 , 2025 | 05:34 PM