Rashmika Mandanna: అతని కోసం.. తూటాకైనా ఎదురెళ్తా..
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:24 AM
'ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా.. నా కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను- Rashmika Mandanna
వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna). తాజాగా ఆమె నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girl friend) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ ఫలితాన్ని పొందింది. ప్రస్తుతం 'మైసా' (Mysaa) సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ మధ్యనే విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందని వార్తల్లో నిలిచిన ఆమె మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పాలని ఓ ఫ్యాన్ కోరగా రష్మిక నవ్వుతూ సరదాగా జవాబు చెప్పింది.

'ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా.. నా కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. నన్ను డీప్ గా అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి. అన్ని పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి.. ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని నేను కోరుకుంటున్నాను. నాకోసం యుద్ధం చేయాలి. అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా’ అని రష్మిక తెలిపారు. గత నెలలో విజయ్ఈ దేవరకొండ, రశ్మికకు నిశ్చితార్థం జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనిపై ఆమె పరోక్షంగా స్పందించారు. ‘నా ఎంగేజ్‌మెంట్ విషయంలో జనాలు ఏం అనుకుంటున్నారో అది నిజమే. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా' అని అన్నారు.
ALSO READ: Nayagan Case: ‘నాయగన్ స్టోరీ సీన్ బై సీన్ చెప్పగలను.. హైకోర్టు న్యాయమూర్తి
Nandita swetha: ఒక సినిమా హిట్ అయితే.. అలా అనుకోకూడదు
Akhanda 2: అఖండ తాండవం ప్రోమో వచ్చేసిందిరోయ్..