Rashmika Mandanna: ఆ వివాదంపైఎవరు ఏమనుకున్నా పట్టించుకోను..
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:43 PM
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా అదే చేద్దామని ట్రై చేసిందా అంటే..
Rashmika Mandanna: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా అదే చేద్దామని ట్రై చేసిందా అంటే.. కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడనాట అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక అదే గుర్తింపుతో తెలుగులో అడుగుపెట్టి.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేషనల్ క్రష్ గా మారింది. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ మొత్తం ఏలడం మొదలుపెట్టింది. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదు అని పెద్దలు చెప్తారు. కానీ, రష్మిక మాత్రం రచ్చ గెలిచి.. మళ్లీ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదు.
స్టార్ హీరోయిన్ గా ఎదిగాకా కన్నడలో రష్మిక సినిమాలు చేసింది లేదు. ఇక ఏరోజు కూడా కన్నడ ఇండస్ట్రీ గురించి అమ్మడు పట్టించుకున్నది లేదు. ఇది కన్నడిగులకు ఆగ్రహానికి గురిచేసే విషయం. కన్నడలో ఒక మంచి సినిమా రిలీజ్ అయినా.. కన్నడ నటుడుకు అవార్డు వచ్చినా.. కన్నడ ఇండస్ట్రీ వివాదంలో ఉన్నా రష్మిక స్పందించదు. ముఖ్యంగా కన్నడ హీరో రిషబ్ శెట్టికి, రష్మికకు మధ్య మొదటినుంచి విభేదాలు ఉన్నాయన్న విషయం తెల్సిందే. ఆ కోపంతోనే రష్మిక కాంతార సినిమాను ప్రశంసించలేదని కన్నడిగులు కన్నెర్ర చేస్తున్నారు.
కాంతార ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెల్సిందే. ఈ మధ్య రిలీజ్ అయిన కాంతార చాఫ్టర్ 1 కూడా భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో కన్నడ స్టార్స్ అందరూ ఈ సినిమాపై ప్రసంశలు కురిపించారు. ఒక్క రష్మిక తప్ప దీంతో.. రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని ఒక వార్త పుట్టుకొచ్చింది. తాజాగా ఈ వివాదంపై రష్మిక స్పందించింది. ఆమె నటించిన థామా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రూమర్స్ కు చెక్ పెట్టింది.
'ఏ సినిమా అయినా నేను రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లో చూడలేను. కొంచెం ఆలస్యంగా చూస్తాను. కాంతార సినిమా కూడా నేను అలాగే చూసాను. అప్పుడు కూడా సినిమా గురించి ఏమి మాట్లాడలేదు అన్నారు. కానీ, నేను సినిమా చూసిన వెంటనే చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ చేశాను. వారు కూడా నాకు సమాధానం ఇచ్చారు. తెరవెనుక ఏమి జరుగుతుందో ఎవరికీ ఏమి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ పని నేను చేయనుకూడా. అందుకే ఈ విషయంలో ఎవరు ఏమన్నా నేను పట్టించుకోన. నా నటన విషయంలో ఎవరైనా అంటే దానిని సీరియస్ గా తీసుకుంటాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Thursday Tv Movies: గురువారం, Oct 9.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
Maheshbabu: పదిహేనేళ్ళ 'ఖలేజా'...