Prabhutva Sarai Dukanam: టీజర్ మొత్తం బూతులు.. రిలీజ్ కానివ్వం..ఖబర్దార్.
ABN , Publish Date - Oct 15 , 2025 | 09:00 PM
ఈమధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే అందులో నార్మల్ డైలాగ్ లు ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కోవాల్సిన పరిస్థితి.
Prabhutva Sarai Dukanam: ఈమధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే అందులో నార్మల్ డైలాగ్ లు ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. బూతులు లేనిదే సినిమా ఉండడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులు ఏదైతే చూస్తున్నారో అదే తీస్తున్నామని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే అసలు పిచ్చి బూతులు ఉంటున్నాయి. కనీసం బీప్ కూడా వేయకుండా అలానే టీజర్ లు, ట్రైలర్ లు రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్ పై దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రారన్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. పృథ్వీ రాజ్ మరియు అదితి మ్యాకల్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను మేకర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం బూతులతో నింపేశారు. పచ్చి బూతులు తప్ప ఆ టీజర్ లో ఏం లేదు అని చెప్పొచ్చు. ఇక ఈ టీజర్ పై మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
టీజర్ లోని డైలాగులు కొంత అసభ్యకరంగా ఉన్నాయని, అలాగే ఈ చిత్ర టీచర్ లో తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ ఆడవారిని అవమానిస్తూ డైలాగులు ఉన్నాయంటూ మహిళా సమైక్య ప్రతినిధులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ గారిని కలిసి ఫిర్యాదు చేశారు.
'ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్ లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణలోని మహిళలు ఇంత నీచంగా మాట్లాడుతారా? అంతేకాక ఆడవారితో కూడా అటువంటి బూతులతో కూడిన డైలాగులు చెప్పించారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ చిత్రం విడుదలయితే మేము ఊరుకోము, ఖబర్దార్. జాతీయ అవార్డు గ్రహీత అందుకున్న దర్శకుడు ఇటువంటి చిత్రాలు తీయడం అనేది చాలా తప్పు. మహిళలు మీకు అలా కనిపిస్తున్నారా? రాజకీయాలలోని మహిళల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమాను విడుదల కానివ్వము. అవసరమైతే సెన్సార్ బోర్డును ముట్టడిస్తాం' అంటూ వారు ఫైర్ అయ్యారు. మరి ఈ ఫిర్యాదుపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Thursday TV Movies: గురువారం, Oct16.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Vishal: డైరెక్టర్ తో విభేదాలు.. ఆగిన విశాల్ కొత్త మూవీ