Rashmika Mandanna: ‘కింగ్డమ్’ రష్మిక ఎమోషనల్ ట్వీట్..
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:07 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. అలాగే ఇరువుకి మధ్య లవ్ ట్రాక్ ఉందని టాక్ నడుస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. అలాగే ఇరువుకి మధ్య లవ్ ట్రాక్ ఉందని టాక్ నడుస్తోంది. అయితే సినిమాలు విడుదల సమయంలో ఒకరికొకరు విష్ చేసుకుంటుంటారు. తాజాగా నటించిన
‘కింగ్డమ్’ (Kingdom) చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ స్టైల్‌లో ఓ డైలాగ్‌తో ట్వీట్ చేసింది.
‘నీకూ, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఎంత ముఖ్యమో (కింగ్డమ్ సక్సెస్‌ను ఉద్దేశించి) నాకు తెలుసు విజయ్.. ‘మనం కొట్టినం’ కింగ్‌డమ్.. అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె మాటల వెనుక బలమైన భావం కనిపిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ సినిమా కోసం విజయం అంతగా కష్టపడ్డారని, సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నామనే భావోద్వేగం ఆ ట్వీట్‌లో కనిపిస్తుంది. రష్మిక ట్వీట్‌పై విజయ్ దేవరకొండ స్పందించారు. ‘మనం హిట్‌కొట్టాం’ అని పేర్కొన్న ఆయన హార్ట్ ఎమోజీ జోడించారు. విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ALSO READ: Samantha - Raj nidimoru: సామ్ - రాజ్ మళ్లీ దొరికేశారు.. ఈసారి ఎక్కడంటే..
Vijay sethupathi: లైంగిక వేధింపుల ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
War 2: ఊపిరి ఊయలలాగా.. అంటూ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
OG: ఓజీ.. ఉస్తాద్ క్రేజీ అప్‌డేట్ వైరల్..
Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ