సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే పిల్లలు కావాలంటుందే

ABN, Publish Date - Oct 28 , 2025 | 06:47 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్న చిత్రాల్లో ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) ఒకటి.

Rashmika Mandanna

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తున్న చిత్రాల్లో ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) ఒకటి. నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని , విద్యా కొప్పినీడి నిర్మిస్తుండగా.. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ది గర్ల్ ఫ్రెండ్ శిరం నుంచి రిలీజైన ప్ [ పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక తనకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడి షాక్ ఇచ్చింది.

ఈ మధ్యనే రష్మికకు, హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఇక ఆ విషయం మాత్రం రష్మిక ఏ ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టలేదు. ఇక ఒక ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్.. తన పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యి వాళ్ళ సొంత ప్రపంచాన్ని చూసేవరకు తాను బతికి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఆరోగ్యం ఇప్పుడు చాలా ముఖ్యమని, ఎంత పనిచేసినా చివరకు తగిన రెస్ట్ అనేది అవసరమని చెప్పాడు. దానికి రష్మిక సైతం అంగీకరించింది.

ఇక హెల్త్ గురించి రష్మిక మాట్లాడుతూ.. ' నేను ఇంకా తల్లి కూడా కాలేదు, కానీ నాకు పిల్లలు పుట్టబోతున్నారని నేను ఇప్పటికే భావిస్తున్నాను. అలా జరుగుతున్న ప్రాసెస్ ను నేను ప్రేమిస్తున్నాను. ఇంకా పుట్టని నా చిన్నారుల గురించి నేను ఇప్పుడే లోతుగా ఆలోచిస్తున్నాను అనిపిస్తుంది. వారికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. వారిని రక్షించుకోవాలి. వారికోసం యుద్ధం చేయడానికి నేను ఇప్పటి నుంచే ఫిట్ గా ఉండాలి. నేను దాని గురించి బలంగా ఆలోచిస్తున్నాను.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకా పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే పిల్లల గురించి చెప్పుకొస్తుంది. రష్మిక పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యి గృహిణిగా ఉండిపోతుందేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

The Great Pre Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్

Theater Movies: శుక్ర‌వారం, ఆక్టోబ‌ర్ 31న‌.. దేశ‌ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న‌ సినిమాలివే

Updated Date - Oct 28 , 2025 | 06:47 PM