Rashmi Gautham: రష్మీ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:15 PM
జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Rashmi Gautham: జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్న ఈ భామ.. హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఛాన్స్ లు మాత్రం దక్కడం లేదు. అయినా కూడా అడపాదడపా హీరోయిన్ గా కనిపిస్తూనే ఉంది. జబర్దస్త్ నుంచి వెండితెరకు వచ్చిన అనసూయ.. ప్రస్తుతం ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, రష్మీ మాత్రం జబర్దస్త్ ను వదలకుండా యాంకర్ గా కొనసాగుతూనే సినిమాల్లో కూడా బిజీగా మారింది.
ఇక నిత్యం రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా జంతు ప్రేమికురాలు అయినా రష్మీ.. వాటికి ఏదైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేదు. వాటిని సంరక్షించాలని కోరుతూ ఉంటుంది. మూగ జీవాలు అంటే ఆమెకు ప్రాణం. అయితే ఈమధ్యనే రష్మీకి సర్జరీ జరిగిన విషయం తెల్సిందే. దానివలన ఆమె కొన్నిరోజులు వృత్తికి దూరమయ్యినట్లు కూడా తెలిపింది. అయితే తాజాగా రష్మీ మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. వృత్తితో పాటు సోషల్ మీడియాకు కూడా ఆమె ఒక నెలరోజులు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.
'హలో అందరికీ నెల రోజుల పాటు అవసరమైన డిజిటల్ డిటాక్స్ తీసుకుంటున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని అవరోధాలను ఎదుర్కొంటున్నాను. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. కచ్చితంగా నేను ధృడంగా తిరిగివస్తాను. నేను నా శక్తిని పునరుద్ధరించుకోవాలి. నన్ను నేను మెరుగుపరుచుకోవాలి. నాకు ఏది కావాలి.. ఎలాంటివి కావాలని నా ఆత్మా పరిశీలన చేసుకోవద్దని సమయం పడుతుంది. అందరూ నేను బలంగా ఉన్నానని అనుకుంటారు. కానీ, నేను కూడా చాలా కృంగిపోయాను. వాటన్నింటిని సరిదిద్దుకోవాలి. నేను ఉన్నా లేకున్నా మీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను' అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఏదీ శాశ్వతం కాదు. ఈ కాలం గడిచిపోతుంది' అంటూ చెప్పుకొచ్చింది.
రష్మీ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి.. ? నిజంగానే డీటాక్స్ కోసం ఈ నిర్ణయం తీసుకుందా.. ? లేక వేరే ఏదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నావ్ రష్మీ.. అన్ని సెట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో జబర్దస్త్ నుంచి రష్మీ బయటకు వచ్చేసిందని, కొత్త ప్రాజెక్ట్ ఓకే చేయడంతో దానికోసం ప్రిపేర్ అవుతుందని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో అనేది తెలియాల్సి ఉంది.
Boney Kapoor: జాన్వీ కపూర్ తండ్రి.. నయా లుక్! సోషల్ మీడియా షేక్
Harihara Veeramallu: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను...