Boney Kapoor: జాన్వీ క‌పూర్ తండ్రి.. న‌యా లుక్! సోషల్ మీడియా షేక్

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:01 PM

అతిలోక సుంద‌రి శ్రీదేవి భ‌ర్త‌ బోనీ కపూర్ కొత్త లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.

బాలీవుడ్ అగ్ర నిర్మాత, అతిలోక సుంద‌రి శ్రీదేవి భ‌ర్త‌ బోనీ కపూర్ (Boney Kapoor) కొత్త లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ద‌శాబ్దాలుగా అధిక బరువు, లావుగా క‌నిపించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడిన ఆయ‌న ఇప్పుడు ఏకంగా 25 కిలోల బరువు తగ్గి స్లిమ్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక రహస్యం ఖరీదైన జిమ్, వర్కౌట్స్ కాదు..సాధారణ ఆహారపు అలవాట్లతో కేవలం సింపుల్ డైట్ ప్లాన్, క్రమశిక్షణతో ఆయ‌న ఇది సాధించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన న్యూస్‌తో పాటు డైట్ ప్లాన్ కూడా సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Boney Kapoor

బరువు తగ్గాలంటే జిమ్ అవసరం అని చాలా మంది అనుకుంటారు. కానీ నేను కేవలం ఆహార నియమాలు పాటించడం ద్వారా ఇది సాధించానని బోనీ తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఈ మార్పు సాధించగలరని అన్నారు. అల్పాహారంగా పండ్లు, తాజా పండ్ల రసాలు, జవర్ రోటీ తీసుకునే వాడిన‌ని, మధ్యాహ్నం భోజనంలో సలాడ్లు, తేలికపాటి సూపులు, రాత్రి స‌మ‌యంలో కార్బోహైడ్రేట్లు తగ్గించి, కేవలం లైట్ డైట్ తీసుకునే వాడినిని తెలిపారు. అంతేగాక అదనంగా, అనవసరమైన విందులు, హై-కేలరీ ఫుడ్ పూర్తిగా మానేశాను అని బోనీ తెలిపారు. ప్రస్తుతం బోనీ కపూర్ స్లిమ్ లుక్‌లో క్యాజువల్, సెమీ ఫార్మల్స్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Boney Kapoor

Updated Date - Jul 23 , 2025 | 01:20 PM