Harihara Veeramallu: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను...

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:34 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా ఏపీ విద్య, ఐ.టి. శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

Hari Hara Veera Mallu

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా మరికొన్ని గంటల్లో జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలను తెలియచేశారు. గురువారం నారా లోకేశ్‌ 'వినాలి... వీర మల్లు చెప్పింది వినాలి' అనే పాటకు సంబంధించిన 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానితో పాటే 'మా పవనన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:36 PM