Janhvi Kapoor: పుురుషాధిక్యత ప్రపంచంలో .. నేర్పుతో ఉండాలి..

ABN , Publish Date - Oct 25 , 2025 | 02:52 PM

బాలీవుడ్‌లో బంధుప్రీతి(Nepotism), పురుషాధిక్యత (male dominance) విషయాలపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) మాట్లాడారు.

బాలీవుడ్‌లో బంధుప్రీతి(Nepotism), పురుషాధిక్యత (male dominance) విషయాలపై తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) మాట్లాడారు.  ‘టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌’ టాక్‌ షోలో  పరిశ్రమలో ఎదుర్కొంటోన్న సమస్యలపై మాట్లాడారు. పురుషాధిక్య ప్రపంచంలో గెలుచుకురావాలంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుందని, తాను ఎన్నోసార్లు అలా ఉన్నానని అన్నారు.

‘నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి పరిశ్రమలోకి వచ్చాను. అయినప్పటికీ కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. ఈ రంగంలో కొనసాగాలంటే పురుష అహంకారాన్ని ఎదుర్కోవాలి. నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నేను ధైౖర్యంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలను. కానీ, అదే స్థానంలో నలుగురు పురుషులు ఉంటే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేను. వారు నొచ్చుకోకుండా మాట్లాడాల్సి ఉంటుంది. అలా చేయడానికి చాలా నేర్పు ఉండాలి. నేను ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేశాను. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. ఎంత గొప్పగా నటించే కెపాసిటీ ఉన్నా  అవతలి వారి కోసం కొంచెం తగ్గి నటించాల్సి వస్తుంది. అలాగే మరికొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను ‘ఇది నాకు నచ్చలేదు.. నేను చేయను’ అని చెప్పే బదులు. నాకు అర్థం కావడం లేదు అని చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక్కడన్నీ పాలిటిక్సే’ అని అన్నారు.  ఈ షోకి వ్యాఖ్యాతల్లో ఒకరైన ట్వింకిల్‌ ఖన్నా జాన్వీ మాటల్ని అంగీకరించారు. 1990ల్లో పరిశ్రమలో ఉన్నప్పుడు తాను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.  ఇటీవల జాన్వీ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌-బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ శ్రీలంకలో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

Updated Date - Oct 25 , 2025 | 02:52 PM