RAPO22: ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ టికెట్టు ఇవ్వాల్సిందే..
ABN , Publish Date - May 15 , 2025 | 01:23 PM
రామ్ పోతినేని (Ram) హీరోగా మహేశ్‌బాబు పి (Mahesh Babu p) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాపో 22 (Rapo22)చిత్రానికి టైటిల్ ఖరారైంది. గురువారం రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను రివీల్ చేశారు.
రామ్ పోతినేని (Ram) హీరోగా మహేశ్‌బాబు పి (Mahesh Babu p) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాపో 22 (Rapo22)చిత్రానికి టైటిల్ ఖరారైంది. గురువారం రామ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Andhra King Taluka - Title Glimpse) ఖరారు చేసినట్లు గ్లింప్స్ విడుదల చేశారు. ‘బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో సాగర్‌గా రామ్ కనిపించనుండగా.. మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే అలరించనున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించనున్నారు.
కథలో ఉపేంద్ర హీరో కాగా.. ఆయన్ని అభిమానించే వ్యక్తిగా రామ్ ఇందులో కనిపించనున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. రామ్ హీరోగా నటిస్తున్న 22వ సినిమా ఇది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీగా ఇది రానుంది. మైత్రీ మూవీస్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ‘ఆంధ్రా కింగ్ తాలుకా.. టికెట్టు ఇవ్వాల్సిందే’ అనేలా చూపించిన విజువల్స్ అలరిస్తున్నాయి.
ALSO READ: RRR 2: 'ఆర్‌ఆర్‌ఆర్ 2' ఉపాసన ప్రశ్న.. జక్కన్న జవాబు..
Criminal Justice: ‘క్రిమినల్ జస్టిస్ 4’ ట్రైలర్ ఆ మూడు నిజాలు.. ఏంటి