RRR 2: 'ఆర్‌ఆర్‌ఆర్‌ 2' ఉపాసన ప్రశ్న.. జక్కన్న జవాబు..  

ABN , Publish Date - May 15 , 2025 | 11:58 AM

రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ఫుల్‌ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్‌ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. 

'ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ లండన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. రామ్‌ చరణ్‌(Ram charan), యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Jr NTR), దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి(SS RAJAMOULI), లండన్‌లో ఉన్నారు. అక్కడి లెజెండరీ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రత్యేక  స్క్రీనింగ్  ఏర్పాటు చేశారు. సినిమా షో తో పాటు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసనా సోషల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫరెవర్‌ అంటూ క్యాప్షన్‌ రాశారు.  ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ఫుల్‌ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్‌ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. 

(SSR Said yes for RRR2)


ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల(Upasana), జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.ఈ సందర్భంగా ఈవెంట్‌ తర్వాత ఉపాసన ఆర్‌ఆర్‌ఆర్‌-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి 'ఎస్‌’ అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఈవెంట్‌లో ఆస్కార్‌ విన్నర్‌ ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్‌ ఫిల్హార్మోనిక్‌ కన్సర్ట్‌ ఆర్కెస్ట్రా  ఆర్‌ఆర్‌ఆర్‌ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు. ఇక సినిమాల విషయానికొేస్త యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో డ్రాగన్‌ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 25, 2026న విడుదల కానుంది. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో 'పెద్ది’ సినిమా చేస్తున్నారు. దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.. మహేశ్‌తో బాబుతో 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది.

Updated Date - May 15 , 2025 | 12:08 PM