సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Pothineni: రామ్ చరణ్ ని చూసి జాలేసింది

ABN, Publish Date - Oct 20 , 2025 | 01:45 PM

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేది ఏది నిజం కాదు. ముఖ్యంగా స్టార్ వారసుల విషయంలో ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది ఎవరికి తెలియదు.

Ram Pothineni

Ram Pothineni: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేది ఏది నిజం కాదు. ముఖ్యంగా స్టార్ వారసుల విషయంలో ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఒక స్టార్ తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే ఎంత ఒత్తిడికి లోనవుతాడో.. ఆ వారసుడు తన తండ్రిలాగానే ప్రేక్షకులను మెప్పించగలనా అనే డైలమా.. అది భరించలేని ఒత్తిడి. ఈ ప్రెషర్ ను తాను రామ్ చరణ్ లో చూసినట్లు హీరో రామ్ పోతినేని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


రామ్ పోతినేని.. జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా విచ్చేశాడు. ఈ షోలో రామ్ మునుపెన్నడూ చెప్పని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నప్పుడు చిరంజీవి పిలిచి తనకు చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే నెపోటిజం ఎంతటి ఒత్తిడిని క్రియేట్ చేస్తుందో చరణ్ విషయంలో చూసినట్లు తెలిపాడు.


'దేవదాస్ రిలీజ్ అయ్యి భారీ విజయం అందుకున్నాకా చిరంజీవి గారు ఒకసారి సినిమా చూస్తానన్నారని అంటే వెళ్లాను. చిరంజీవి గారు నాకు ఒక మాట చెప్పారు. నువ్వు స్టార్ కొడుకువి కాదు. హిట్ వచ్చింది అని లైట్ తీసుకోకు. ప్రతి సినిమా నీకు మొదటి సినిమాలానే ఫీల్ అవ్వాలి. నిరూపించుకోవాలి. స్టార్ కిడ్ అయితే వేరు అని. నేను అప్పుడు ఇవన్నీ పెద్ద పట్టించుకొనేవాడిని కాదు. వచ్చామా.. ఎంజాయ్ చేశామా అన్నట్లు ఉండేవాడిని. అప్పటికి చరణ్ ఇంకా టాలీవుడ్ కి పరిచయం అవ్వలేదు. ఒక కొత్త హీరో హిట్ అందుకున్నాడు.. ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పాలి కదా చరణ్ కి అందుకే పిలిచాను అన్నారు. జనరల్ గా నాకు అలాంటి తండ్రి ఉంటే బావుండేది. ఆ ఎంట్రీ.. చాలామంది డైరెక్టర్స్..నాకు అలాంటిది లేదే అని బాధపడేవాడిని. నాకు ఆ ఫ్రెషర్ లేదు. నేను వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. కానీ, చరణ్ పడుతున్న ప్రెషర్ చూసి నాకే జాలేసింది. స్టార్ కిడ్స్ ఎంత ప్రెషర్ అనుభవిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Alia Bhatt: ఆలియా భట్ ఇంట్లో.. దీపావళి సెల‌బ్రేష‌న్స్‌!

Mana Shankara Vara Prasad Garu: మ‌న బాస్‌.. దీపావ‌ళికి కొత్త లుక్‌తో వ‌చ్చేశాడు!

Updated Date - Oct 20 , 2025 | 01:45 PM