Mana Shankara Vara Prasad Garu: మన బాస్.. దీపావళికి కొత్త లుక్‌తో వచ్చేశాడు!
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:12 PM
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా నుంచి బాస్ చిరంజీవి (Chiranjeevi) స్టైలిష్ లుక్‌ను రిలీజ్ చేశారు.
అనీల్ రావిపూడి ( anil ravipudi), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాంబోలో వస్తున్న సినిమా మన శంకర వర ప్రాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రమోషన్ కార్మక్రమాలు ప్రారంభించి సినిమాను నిత్యం ప్రజల నోళ్లలో నానేలా అనీల్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఈనేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల పాట ప్రపంచాన్ని దున్నేస్తుండడంతో పాటు రీల్స్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. అంతేగాక సినిమా నుంచి రిలీజ్ చేసిన ఇతర ప్రమోషన్ కంటెంట్ కూడా జనంలోకి బాగా రీచ్ అయింది.
తాజాగా సోమవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా నుంచి బాస్ చిరంజీవి (Chiranjeevi) స్టైలిష్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇద్దరి పిల్లలతో కలిసి సైకిల్ తోక్కుతూ ఉన్న ఈ చిత్రం ఫ్యాన్స్ కు కొత్త ఊపు ఇచ్చేలా ఉంది. ఈ ఫొటోలో చిరంజీవి మరింత గ్లామర్‌తో మరింత అందంగా కనిపించి ఛార్మింగ్‌గా ఉ్ననాడు. ప్రజంట్ ఈ లుక్ బాగా వైరల్ అవుతుంది.