RAM MIRIYALA: కోకోకొక్కరోకో.. కోడి గట్టిగా కూయకే! రామ్ మిర్యాల.. కొత్త ఫోక్ సాంగ్ వచ్చేసింది!
ABN, Publish Date - Dec 26 , 2025 | 10:27 AM
ఇటీవల గిరా గిరరా గింగిరా పాటతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెగ సందడి చేస్తున్నాడు ప్రముఖ తెలుగు అగ్ర సినీ గాయకుడు రామ్ మిర్యాల.
ఇటీవల గిరా గిరరా గింగిరా పాటతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని ఇండ్లలో, ఫోన్లలో తెగ సందడి చేస్తున్నాడు ప్రముఖ తెలుగు అగ్ర సినీ గాయకుడు రామ్ మిర్యాల (RAM MIRIYALA). కాస్త విరామం తర్వాత ఆయన స్వరంలో రూపొందిన ఓ నూతన జానపద గీతం (TELUGU FOLK SONG) తాజాగా విడుదలైంది.
కోకోకొక్కరోకో.. కోడి గట్టిగా కూయకే ఎక్కడికైనా పారిపో.. దొంగ కోళ్ల బ్యాచ్ దిగిందమ్మా పారిపో (KODI FULL VIDEO SONG) అంటూ సాగిన ఈ పాట ఆత్యంతం పల్లె జనాలను ఆకట్టుకునేలా ఉంది. రానున్న సంక్రాంతి, కోళ్ల పందాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని కోళ్లకు, వాటిని పెంచే వారికి జాగ్రత్తలు చెబుతూ పాట సాగింది.
ఎప్పటిలానే రామ్ మిర్యాల గొంతు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా ఇందు కోసం తీసుకున్న కాన్సెప్ట్ కూడా భిన్నంగా, ట్రెండింగ్‌గా ఉంది. మీరు ఇంకా చూడకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే రామ్ మిర్యాల యూట్యూబ్ ఛానల్‌కు వెళ్లి ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.